మాదకద్రవ్యాల నివారణకు అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నివారణకు అవగాహన కల్పించాలి

Nov 29 2026 1:53 PM | Updated on Nov 29 2026 1:53 PM

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: మాదకద్రవ్యాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా స్థాయి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. గుర్తించిన హాట్‌స్పాట్‌లలో గస్తీ నిర్వహించాలన్నారు. ‘త్రిశూల్‌’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమష్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి బాలిక కనీసం డిగ్రీ చదవాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. దంపతుల వివాదాల విషయంలో వన్‌ స్టాప్‌ కేంద్రం ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ గౌరవంగా జీవించేందుకు ప్రతి శాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు నిర్మూలించడం అవసరమన్నారు. డీఎస్పీ జి.పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ 52 కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహించామని తెలిపారు. మందుల దుకాణాలలో సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పామన్నారు. 2025లో మహిళలపై 1,270 అఘాయిత్యాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 956 నమోదు అయ్యాయని తెలిపారు. డీఆర్‌వో ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ దుర్గా ప్రసాద్‌, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ రవి, ఐసీడీఎస్‌ పీడీ పి.జి.ప్రసూన, డీఎంహెచ్‌వో ఎం.పద్మావతి, సోషల్‌ వేల్ఫేర్‌ డీడీ కె.ఎల్‌. హర్షిత, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె.పార్థసారథి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement