న్యూస్‌రీల్
మంగళగిరిలో రంగంలో దిగి
ఆదేశాలు ఇస్తున్న చినబాబు పీఏలు
ఇళ్ల పట్టాలు ఇస్తామని ఓటర్లను మభ్యపెడుతున్న అధికారులు
గుంటూరు
బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 26.4470 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
ఎన్నికల్లో ఓటమి భయం కూటమి నేతలకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మెజార్టీ సీట్లు వైఎస్సార్ సీపీకే ఖాయమనే భయంతో మున్సిపల్ ఎన్నికల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల వరకు నామినేషన్లను అడ్డుకున్నారు. రిగ్గింగ్‌లు చేయడం, కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను లాగిపడేయడం వారి కుట్రలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిచినా తాము విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అధికారికంగా కుట్రకు తెరతీస్తున్నారు. చినబాబు కార్యాలయం నుంచి ఐదుగురు పీఏలు రంగంలో దిగి నేరుగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలు పెట్టాలో, ఎవరిని బెదిరింపులకు గురిచేయాలో నేరుగా చినబాబు కార్యాలయం నుంచే అధికారులకు ఆదేశాలు అందుతున్నాయి. సీఎం తనయుడి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు పాటించకపోతే జరిగే పరిణామాలు తలుచుకుని భయంతో అధికారులు ఎన్నికల నియమావళిని సైతం తుంగలో తొక్కుతున్నారు.
ఓట్లు వేస్తేనే ఇళ్ల పట్టాలు ఇస్తాం...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీగా నిత్యావసరాలు తదితర ధరలు పెరిగాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసగించారనే కసి ప్రజల్లో ఉంది. వీటికి తోడు చేనేతలతోపాటు వివిధ వర్గాల ప్రజలకు మొండిచేయి చూపడంపై ఓటర్లు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిని గ్రహించిన చినబాబు... కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వైఎస్సార్ సీపీ కై వసం చేసుకునే ప్రమాదాన్ని గుర్తించారు. దీంతో అధికారులకు ఆయన కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. నేరుగా అధికారులు జనం వద్దకు వెళ్లి త్వరలో ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని, టీడీపీకి సహకరించిన వారిని మాత్రమే లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదని తెలిసినా చినబాబు కార్యాలయం నుంచి వచ్చి ఆదేశాలతో వారు దిగజారి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసేందుకు పలువురు సమాయత్తం అవుతున్నారు.
రిగ్గింగ్ కోసం కిరాయి గూండాలు
వీటన్నింటికీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు లొంగడం లేదని భావించిన టీడీపీ నేతలు ఇక చివరి అస్త్రంగా పోలింగ్ రోజు 12 గంటల నుంచి వైఎస్సార్ సీపీ ఏజంట్లను లాగిపడేసి రిగ్గింగ్ చేసే కుట్రకు తెరతీశారు. ఇందుకోసం గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి వందల మంది కిరాయి గూండాలను మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో మోహరించారని తెలిసింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి సైతం పథక రచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసైనా సరే వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గంలో బలంగా లేదని రాష్ట్ర ప్రజలకు చూపించేలా కుట్రకు పాల్పడుతున్నారు. అందుకు మరీ బరి తెగిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు
అధికారుల ప్రలోభాగాలకు ప్రజలు లొంగరని భయమో, ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటన పనిచేయకపోతే ఓటమి చవిచూడాల్సి వస్తుందనే ఆందోళనో తెలియదుగానీ... చినబాబు పీఏల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. బైండోవర్‌ల పేరుతో వెఎస్సార్ సీపీ ముఖ్య నేతలను పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. పోలింగ్ రోజు బయట కనిపిస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామంటూ భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామంటూ అభ్యర్థులకు ఫోన్లు చేసి నేరుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం జరిగిన ఘటనలు తెరపైకి తెచ్చి ఆ కేసుల్లో అరెస్టు చేస్తామంటూ పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులే పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.


