వైభవం.. అమరేశ్వరుని తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. అమరేశ్వరుని తెప్పోత్సవం

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

వైభవం.. అమరేశ్వరుని తెప్పోత్సవం

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు,

బీసీ మహిళ పామర్తి ఉమాలక్ష్మిపై కక్ష

సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌

ఉపసంహరించుకోవాలని బెదిరింపులు

తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న ‘కూటమి’ కుట్రలు

అమరావతిలోని ప్రముఖ బాల చాముండికా సమేత అమరేశ్వరుని తెప్పోత్సవం మంగళవారం కృష్ణానదిలో వైభవంగా సాగింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఉత్సవమూర్తులను ఘనంగా ఊరేగించారు. కృష్ణవేణికి ప్రత్యేక హారతి నిర్వహించారు.

– అమరావతి

ఎదుర్కోలేక.. ఎరువుల దుకాణంపై దాడి

అన్నవరం (తెనాలి): గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ‘కూటమి’ కుట్రలు కొనసాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పోటీగా దాఖలైన నామినేషన్ల ఉపసంహరణకు తెగిస్తున్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకపోతే, చివరకు కడుపుపై కొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. గుంటూరు జిల్లాల కొల్లిపర మండలంలోని అన్నవరం చిన్న గ్రామం. ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. పంచాయతీ శివారు గౌడపాలెంకు చెందిన వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు పామర్తి అర్జునరావు భార్య ఉమాలక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో అర్జునరావు కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయి. జనసేన మద్దతుదారు తాతా శివయ్య భార్య ఆ తర్వాత నామినేషన్‌ వేశారు. అదే రోజు ఉదయం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఫోన్‌ చేసి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘అదేంటండీ’ అని అడిగితే, ‘ప్రభుత్వాన్ని ఎదుర్కొంటావా? నేనంటే ఏమిటో తెలుసు కదా! ఎలా ఉంటుందో తెలుసు కదా!’ అని బెదిరించారని అర్జునరావు చెప్పారు. ‘స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మనుషులు వచ్చి, ‘మంత్రి గారు చెప్పారు... నామినేషన్‌ వెనక్కి తీసుకోండి’ అంటూ పరోక్షంగా హెచ్చరించారట! గ్రామానికే చెందిన మరొకరు ‘వీడికి పిండి కొట్టుంది... ఎలా నడుపుతాడో చూస్తాం... లైసెన్స్‌ క్యాన్సిల్‌ చేయిస్తాం’ అని హెచ్చరించారు. ఎవరెన్ని చెప్పినా పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ నుంచి తప్పుకొనేందుకు పామర్తి ఉమాలక్ష్మి ససేమిరా అన్నారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

పరోక్షంగా దెబ్బతీసేందుకు...

ఈ నేపథ్యంలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారుల యూనియన్‌ నాయకుల్లో ఒకరు అర్జునరావుకు ఫోన్‌ చేశారు. ‘పోటీలో ఉండే పనైతే జాగ్రత్త!’ అని హెచ్చరించారని చెప్పారు. ఆ తర్వాత కొన్ని గంటలకే, మంగళవారం ఉదయం గుంటూరు నుంచి రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సీహెచ్‌. మురళీకృష్ణ, తహసీల్దార్‌ ఎం. లక్ష్మీమాధవి అన్నవరం వచ్చేశారు. మండల వ్యవసాయ అధికారిని వెంటబెట్టుకుని, ఊరికి దగ్గర్లోని హనుమాన్‌పాలెం శివాలయం సమీపంలో ఉన్న అర్జునరావుకు చెందిన ‘అంకమ్మతల్లి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌’ దుకాణానికి చేరుకున్నారు. అప్పటికి అక్కడ ఉమాలక్ష్మి అల్లుడు వాకా నాగరాజు ఉన్నారు. లైసెన్సులు, స్టాక్‌ రిజిస్టర్ల పేరుతో బెదరగొట్టారు. ‘అర్జునరావు గుంటూరు ఆసుపత్రికి వెళ్లారు’ అని చెప్పినా వినిపించుకోలేదు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను పిలిపించి, దుకాణంలోని రూ.2.35 లక్షల విలువైన స్టాక్‌ను సీజ్‌ చేశారు. వ్యవసాయ అధికారికి అప్పగించి, పురుగుమందుల చట్టం 1968లోని 18 (2), 29 (1) (సీ), నిత్యావసర సరుకుల చట్టం 1955లోని 6 (ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విషయం తెలిసి గ్రామస్తులు అక్కడికి చేరుకుని విజిలెన్స్‌ అధికారులను ప్రశ్నించారు. ఎంతోకాలంగా వ్యాపారం చేస్తున్నా, ఏనాడూ పొరపాటు జరగలేదని, ఇప్పుడు హఠాత్తుగా తనిఖీలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం అక్కడ ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన ఏ రైతూ ఫిర్యాదు చేయకుండానే ఆకస్మిక తనిఖీలకు రావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు అధికారులు ‘తప్పలేదని, మాపైనా ఒత్తిడి ఉందని’ చెప్పారని సమాచారం.

ఆమె కుటుంబానికి చెందిన

ఎరువుల దుకాణంపై అధికారుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement