ఆపరేషన్‌కూ కునికిపాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌కూ కునికిపాట్లు

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 ఆపరేషన్‌కూ కునికిపాట్లు ఆలయ పనుల పరిశీలన

న్యూస్‌రీల్‌

జీజీహెచ్‌లో ఆగిపోయిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జూడాల సమ్మె ప్రారంభం కాగానే నిలిపివేత నేటికీ సేవలు పునరుద్ధరించకపోవడంతో బాలింతలకు కష్టాలు

గుంటూరు
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

తాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్‌ ఎ.శరత్‌ సోమవారం పరిశీలించారు.

పేదలకు ఉపయోగపడే వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నానాటికీ దూసుకెళుతోంది. పలు జిల్లాలకు కీలకంగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కూడా బాలింతలకు సమస్యలు తప్పడం లేదు. అటు పాలకులు, ఇటు అధికారుల నిర్లక్ష్య వైఖరితో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్లకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఆ స్థోమత లేని పలువురు బాలింతలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

సమ్మె కారణంగా...

గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్లు ఆగస్టు మొదటివారంలో సమ్మె చేసిన విషయం విదితమే. ఆగస్టు 25వ తేదీ వరకు సమ్మె కొనసాగింది. సీనియర్‌ వైద్యులకు జీజీహెచ్‌లో ఓపీలో, ఇన్‌పేషెంట్‌ విభాగంలో, సర్జరీల్లో, ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉండి రోగులకు సత్వర వైద్య సేవలు అందించడంలో జూడాల పాత్ర చాలా కీలకం. సమ్మె వల్ల కుటుంబ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సీనియర్‌ వైద్యులు ఆపరేషన్లు నిలిపివేశారు. బాలింతలను సమ్మె అనంతరం రావాలని సూచించారు. సాధారణంగా కాన్పు వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. బాలింతలు కూడా ప్రసవం అనంతరం ఇలా చేయించుకోవడం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిపివేయడం వలన పలువురు బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.

పీహెచ్‌సీల్లోనూ అదే దుస్థితి

మరోపక్క జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నెలల తరబడి చేయకుండా వైద్యులు చోద్యం చూస్తున్నారు. పలువురు వైద్యులు శిక్షణ తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు. మరోపక్క ఆరోగ్య కేంద్రాల్లో తగిన వసతులు కూడా లేవని, అందువల్లే చేయడం లేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలు గ్రామీణ ప్రాంతాల బాలింతలు సైతం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చి వెనుదిరుగుతున్నారు. గత నెలలో ఓపీ విభాగంలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగాన్ని నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లోకి మార్చే ప్రక్రియలో భాగంగా నెలకు పైగా ఆపరేషన్లు నిలిపివేశారు. నూతనంగా భవనంలోకి ఆపరేషన్‌ థియేటర్లు మార్చినప్పటికీ, ఆపరేషన్‌ థియేటర్‌ లైట్లు (ఓటీ లైట్లు) ఏర్పాటు చేయలేదన్న కారణంతో ఆపరేషన్లు ఆగిపోయాయి.

కుటుంబ నియంత్రణ విభాగంలో ఓపీ సేవలకు మాత్రం హాజరై బాలింతలకు కౌన్సెలింగ్‌ చేసి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement