న్యూస్‌రీల్
టిక్కెట్ల పేరిట టోకరా
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
హద్దు దాటిన కూటమి దందా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్లలో టీజీఎండీసీ ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో ఆయనే నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గుంటూరుకు చెందిన తెలుగు తమ్ముడు అడుసుమిల్లి శ్రీధర్ మరికొందరితో రెండు కార్లలో తుమ్మిళ్ల ఇసుక రీచ్ దగ్గరకు చేరుకుని, అక్కడున్న వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. సినీనటుడు, హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్య అనుచరుడిగా ఉండే గుత్తికొండ ఠాగూర్ పేరు చెప్పి దాడి చేయడమే కాకుండా ఇసుక రీచ్ స్టాక్ బుక్కులతోపాటు, రూ.4 లక్షల నగదు తీసుకువెళ్లారు. ఆంధ్రాకు చెందిన వీరికి తెలంగాణ ఇసుకరీచ్‌లతో సంబంధం ఏంటనే అంశంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో రూ.కోట్ల విలువైన భూమికి నకిలీ పత్రాలను సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అందులో కూడా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెడికల్ వ్యాపారి, జనసేన పార్టీలో కీలకంగా ఉండే కమ్మెల శ్రీనివాసరావు కూడా అరెస్టు అయ్యారు. నాదెండ్ల మనోహర్ అనుచరుడిగా శ్రీనివాసరావు ఉన్నారు. హైదరాబాద్ బృందావన కాలనీలో రూ.450 కోట్ల విలువైన 30 వేల గజాల స్థలానికి ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించింది. మంచి పార్టీని చూసి అమ్మకానికి పెట్టింది. కొనుగోలు చేసేందుకు వచ్చినవారు, ఎందుకై నా మంచిదని తమకు ఇచ్చిన డాక్యుమెంటుతో అసలు ఓనరును కలిశారు. పరిశీలించిన స్థల యజమాని అది నకిలీపత్రమని తేల్చారు. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సూచనపై ముఠా సభ్యులకు కబురు పెట్టారు. ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కమ్మెల శ్రీనివాసరావుపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషనులో మరో కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలో భూమి ఇప్పిస్తానని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతును నమ్మించి శ్రీనివాసరావు పలుమార్లు రూ.70 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ భూమి ఇవ్వటం లేదని రైతు ప్రశ్నించటంతో కురగల్లులోని ఓ భూమికి జీపీఏ సృష్టించి, భూమి హక్కు పత్రం పేరిట ఆ రైతుకు అప్పగించాడు. రైతు ఆ భూమిని బేరం పెట్టారు. స్థల యజమానికి ఈ విషయం తెలిసింది. ‘నా భూమిని మీరు అమ్మటం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇది నా భూమి అంటూ అనంతపురం రైతు తన దగ్గరున్న జీపీఏ పత్రాన్ని చూపారు. దీనితో స్థల యజమాని, ఇతరులు మంత్రి లోకేశ్ కార్యాలయానికి సమాచారమిచ్చారు. ఆ ప్రకారం రిజిస్ట్రేషన్ ఐజీ విచారించారు. అనంతపురం రైతు దగ్గర ఉన్నది నకిలీ జీపీఏగా తేల్చారు. కమ్మెల శ్రీనివాసరావు డబ్బుపై ఆశతో తప్పుడు పత్రాలతో ‘ఎనీవేర్’లో భాగంగా మొవ్వ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపీఏ చేసినట్టు గుర్తించారు. ఆ జీపీఏను రద్దు చేశారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషనులో కేసు నమోదు చేశారు. ఇది విచారణలో ఉండగానే శ్రీనివాసరావును నార్సింగ్ పోలీసులు రిమాండ్‌కు పంపారు.
తెలంగాణకు వెళ్లి మరీ దౌర్జన్యం
చేసిన తెలుగుదేశం నేత
బాలకృష్ణ ముఖ్య అనుచరుడి పేరు
చెప్పి ఇసుక రీచ్ ఉద్యోగులపై దాడి
తిరుమల దర్శనాలు అంటూ
జనసైనికుడి మోసం
60 మందిని తిరుమల
తీసుకువెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్
నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో
తెనాలి జనసైనికుడు
తాజాగా మరో జనసైనికుడు గుంటూరు భక్తులను నకిలీ సిఫారసు లేఖలతో రూ.4.22 లక్షల మేరకు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానని నమ్మబలికిన గుంటూరుకు చెందిన నిమ్మల శ్రీనివాస్ నగరానికి చెందిన 60 మంది భక్తుల నుంచి రూ.4.22 లక్షలు వసూలు చేశారు. వారికి దర్శనాలు కల్పించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఘటన తిరుమలలో సోమవారం చోటుచేసుకుంది. తనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కోటా ద్వారా సుప్రభాత సేవ దర్శన టికెట్లు మరియు తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో భక్తుల నుంచి వివిధ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా రూ.4.22 లక్షలు వసూలు చేశారు. కొంతసేపు ఫోన్ ద్వారా మాట్లాడి, తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. నిందితుడు అందజేసిన సిఫారసు లేఖలను టి.టి.డి. అధికారులకు చూపగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. టి.టి.డి. విజిలెనన్స్ అధికారుల సూచన మేరకు బాధితులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
అచ్చంపేట: ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎగువ నుంచి 400, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
కూటమి నేతల అరాచకం హద్దులు దాటుతోంది. జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలు, జనసైనికుల అరాచకం తెలంగాణ వరకూ పాకింది. తెలంగాణలో దాడుల నుంచి, భూ కబ్జాల వరకూ సాగింది. మరొకరు ఏకంగా తిరుమల దర్శనాల పేరుతో భక్తులను మోసం చేశారు. వీరందరూ గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కావడం గమనార్హం.


