ఉద్యోగులపై కక్ష.. విధులంటేనే శిక్ష ! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై కక్ష.. విధులంటేనే శిక్ష !

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

ఉద్యోగులపై కక్ష.. విధులంటేనే శిక్ష ! నెహ్రూనగర్‌ : గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 568 సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 4,690 మంది సెక్రటరీలు పనిచేస్తున్నారు. వీరిలో 541 మంది సిబ్బంది వివిధ శాఖల్లో డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ నుంచి అత్యధికంగా 154 మంది సెక్రటరీలు అనధికారికంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. తాడికొండలో 25, పెదకాకానిలో 21, తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 18, తెనాలిలో 17, కొల్లిపరలో 17 మంది చొప్పున అనధికారికంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వివిధ డ్యూటీలతో సతమతమవుతున్న సిబ్బంది కక్కలేక మింగలేక విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇటీవల గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 162వ వార్డు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ నాగూర్‌బాబుకు బ్రెయిన్‌ స్టోక్‌ వచ్చింది. సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. చాలా మంది సిబ్బంది మానసికంగా కుంగిపోతూ దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి లక్షల మందికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రభుత్వం మారిన వెంటనే సచివాలయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కావాలనే సచివాలయ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకుని ‘మీకు ఈ ఉద్యోగాలు ఎందుకు? పనిచే యరు. అనవసరంగా వైఎస్‌ జగన్‌ మీకు ఉద్యోగాలు ఇచ్చారని’ చీదరించుకుంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికై నా డెప్యూటేషన్‌పై విధులు నిర్వహించే వారిని తిరిగి సచివాలయాలకు బదిలీ చేయడంతోపాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఒకేసారి పలు విధుల నుంచి సచివాలయ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

తీవ్ర పని ఒత్తిడి పెంచిన ప్రభుత్వం

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు చాలా వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది ముఖ్యంగా తక్కువ వయస్సు ఉన్న సెక్రటరీలు గుండెపోటుతో, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఏమైనా పర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మల్టిపుల్‌ టాస్కులు ఇచ్చి తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేసి బానిసల్లా చూస్తోంది. సచివాలయ ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. మల్టీపుల్‌ టాస్క్‌ల నుంచి సచివాలయ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలి.

వేధింపుల పర్వం

సచివాలయ సెక్రటరీలు రోజువారీ విధులతోపాటు, ప్రతి నెల ఇంటింటిరీ వెళ్లి పింఛన్లు పంపిణీ, మొన్నటి వరకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల ఆన్‌లైన్‌ సర్వేలతోపాటు ప్రస్తుతం సర్‌ ప్రక్రియ విధుల్లో ఉంటున్నారు. దీనిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సిబ్బంది విధుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టడంతోపాటు లక్ష్యాలు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల బీఎల్‌ఓ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు పది మంది వరకు సచివాలయ సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో ఎక్కడ తమ మీద సస్పెండ్‌ వేటు పడుతుందో అని భయాందోళనలు చెందుతున్నారు.

బీఎల్‌ఓ పనులు, రెగ్యులర్‌ విధులకు

తోడు అదనపు భారంతో సతమతం

లక్ష్యాలు ఇచ్చి మరీ సిబ్బందిని తీవ్ర

ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు

ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల

ఓ సచివాలయ ఉద్యోగికి బ్రెయిన్‌ స్ట్రోక్‌

తీవ్ర ఒత్తిడి అనారోగ్యంపాలు

చంద్రబాబు సర్కారు అక్కసు

– ఆర్‌.అనిల్‌కుమార్‌, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా చైర్మన్‌, జీడబ్ల్యూఎస్‌ఈఏ స్టేట్‌ అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీ

సచివాలయ ఉద్యోగులపై పనిభారం రోజురోజుకీ పెరిగిపోతోంది. రెగ్యులర్‌ డ్యూటీలతోపాటు బీఎల్‌ఓ విధులు, ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు టార్గెట్లతో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 162 సచివాలయ వార్డు అడ్మిన్‌ సెక్రటరీ నాగూర్‌బాబు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆసుపత్రి పాలయ్యారు. ఇదే విధంగా చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement