ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

గుంటూరు రూరల్‌: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని నల్లపాడు పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన పెరికల సాగర్‌ గుంటూరు నగరంలోని కేవీపీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పలుచోట్ల ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ద్విచక్రవాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో నిందితుడిని గుర్తించారు. హౌసింగ్‌ బోర్డు ఆర్చి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలను ఒప్పుకున్నాడన్నారు. అతని వద్ద నుంచి తొమ్మిది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు గుంటూరు నగరం, నల్లపాడు, కొత్తపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు. చోరీ చేసిన వాహనాలను లాలుపురం గ్రామ శివారులోని ఓ పాడుబడిన రేకుల షెడ్లో దాచిపెట్టినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా గుంటూరు, కొత్తపేట పోలీస్‌స్టేషన్లలో పలు వాహన చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించి చోరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన నల్లపాడు సీఐ పి.భాస్కర్‌, ఎస్‌ఐ ఎ. మధుపవనన్‌తోపాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement