జిల్లాలో సగటు వర్షపాతం 7 మి.మీ. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో సగటు వర్షపాతం 7 మి.మీ.

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 10 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 24.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా చేబ్రోలు మండలంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. సగటున ఏడు మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 22.4 మి.మీ., తాడికొండ 22, పెదకాకాని 20, మంగళగిరి 16.6, ప్రత్తిపాడు 8.4, దుగ్గిరాల 7.6, తాడేపల్లి 2.4, పొన్నూరు మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. జూన్‌ 23వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 74.4 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 87 మి.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement