అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

Feb 21 2026 7:34 AM | Updated on Feb 21 2026 7:34 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

గుంటూరు మెడికల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్చి 3, 4 తేదీలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీజీవోస్‌ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్యాంసుందర్‌ శ్రీనివాస్‌, స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ నాగూల్‌ షరీఫ్‌, జిల్లా ఉమెన్‌ వింగ్‌ చైర్‌ పర్సన్‌ ఎస్‌ కె తాజున్నీసా, కన్వీనర్‌ ఎం విజయలక్ష్మీ, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement