సమాన అవకాశాలతో సామాజిక న్యాయం
● జనగణనతో పాటు కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని కోరుతూ ‘మా వాటా– మాకివ్వండి’ నినాదంతో వాడవాడలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి వారిని చైతన్యవంతులను చేయాలని, అందుకు సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పోరాడే ఉద్యమకారులు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.
● జన విజ్ఞాన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలులో కేరళ రాష్ట్రం ముందుందని, ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు ముందుకు రావాలని అన్నారు.
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి సామాజిక న్యాయం గురించి చర్చించుకోవడం శోచనీయమని అన్నారు.
● ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయం రిజర్వేషన అంశం కాదని, అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించటమే సామాజిక న్యాయమని అన్నారు.
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, బీసీ మహాసేన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూరి నరసింహారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సీపీఐ నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్‌లో రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకాలలో సామాజిక న్యాయం, పేదలకు స్థానం ఎక్కడుందో చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా సమితుల ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగంభవన్‌లో సంపద పునఃపంపిణీతో సామాజిక, ఆర్థిక న్యాయం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య