ముగిసిన భాష్యం ఒలంపస్ క్రీడా పోటీలు
దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం సొంతం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత
గుంటూరు ఎడ్యుకేషన్: లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత అన్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గుంటూరు వికాస్‌నగర్‌లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా గ్రౌండ్‌లో భాష్యం ఒలంపస్ పేరిట జరుగుతున్న భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీల కార్యక్రమం సోమవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సరిత మాట్లాడుతూ 60 వేలకు మందికి పైగా విద్యార్థులు ఈ భాష్యం ఒలంపస్‌లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం నిజమైన క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్స్ బృందం ఓపెన్ పరేడ్‌లో ప్రదర్శించిన క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పోలీస్ అధికారిగా గర్వపడేలా చేశాయన్నారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు ట్రోపీలను అందజేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
గెలుపొందిన జట్ల వివరాలు..


