ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

Jan 12 2026 7:34 AM | Updated on Jan 12 2026 7:34 AM

ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

ఓబన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

మంగళగిరి టౌన్‌: వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని ఆంధ్రపద్రేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు, సినీ నటుడు సుమన్‌ అన్నారు. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి నిర్వహించారు. సినీ నటుడు సుమన్‌, పలువురు బీసీ నాయకులతో కలసి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశన శంకరరావు, సుమన్‌లు మాట్లాడుతూ బీసీ వడ్డేర కులానికి చెందిన ఓబన్న భయం ఎరుగని వడ్డెరలు, బోయలు, చెంచులు, ఇతర వెనుకబడిన తరగతుల వారిని సైన్యంలో చేర్చి ఆనాడే బీసీల ఐక్యతను చాటారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుమ్మర క్రాంతి కుమార్‌, నాయకులు విజయకుమార్‌, మూర్తి, మేకా వెంకటేశ్వరరావు, కాగితాల స్వాతి, శారద, పద్మావతి, డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమస్ఫూర్తి.. వడ్డే ఓబన్న

పట్నంబజారు: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పేరు చెబితినే గుర్తుకు వచ్చేది ఉద్యమ స్ఫూర్తి అని.. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో ఆయన సాగించిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కీర్తించారు. గుజ్జనగుండ్లలోని తన కార్యాలయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన నిరంతర కృషి నేటి తరానికి మార్గదర్శకమన్నా రు. విద్య, ఉపాధి, ఆత్మగౌరవం అనే మూడు మూలస్తంభాలపై సమాజం నిలబడాలన్నది ఆయన ధృఢ నమ్మకమన్నారు. దమకాండకు ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ప్రజల్లో నాటిన నేతగా ఓబన్నను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు పఠాన్‌ సైదాఖాన్‌, జి.ప్రభు, కొండా రవి, వేలాద్రి, తురాకా రమేష్‌, నాగరాజు, బొల్లెద్దుల వెంకటేష్‌, వెంకటే శ్వరరెడ్డి, సత్యన్నారాయణరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement