కేసీ స్కూల్స్ తపాలా పోస్టల్ కవర్ ఆవిష్కరణ
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని కొండవీటి కమిటీ స్కూల్స్ (కేసీ స్కూల్స్) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రత్యేక తపాలా పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ విద్యాభివర్థనీ సంఘంను 1925 డిసెంబరు 25న 1925న స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. ఈ సంస్థ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 11వ తేదీన ఆదివారం శత వసంతాల పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తపాలా కవర్‌ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు కేసీ స్కూల్స్ కరస్పాండెంట్ గాదె సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, మాదిరెడ్డి హనుమారెడ్డి, కాశింరెడ్డి పాల్గొన్నారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


