అంకిత భావానికి అందలం
అలంకారం కాదు..పదవి బాధ్యత
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కష్టపడి పనిచేసి.. పార్టీ పట్ల నిబంద్ధతతో నిస్వార్థంగా ముందుకు సాగే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అంకితభావంతో ముందుకు సాగే వారిని అందలమెక్కించడంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుటారని, అందుకు పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర జోనల్ వర్కింగ్ అధ్యక్షుడిగా పోలూరి వెంకటరెడ్డి నియామకమే నిదర్శమన్నారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డి అభినందన సభ శుక్రవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్ అధ్యక్షతన నిర్వహించారు. పోలూరిని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఏర్పాటు కాక ముందే.. గుంటూరులో వైఎస్సార్ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన ఘనత పోలూరి సొంతమన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత, వైఎస్ జగన్‌ను ఒంటరి చేసి వేధిస్తున్న సమయం నుంచే ఆయన వెన్నంటి నడిచిన అతి కొద్ది మందిలో పోలూరి ఒకరని తెలిపారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పూర్తి అంకితభావంతో పార్టీ అభ్యున్నతికి కృషి చేశారన్నారు. పదవులతో పని లేకుండా పార్టీ కోసమే నిస్వార్థంగా పనిచేయడం ఆయన నైజమని ప్రశంసించారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నేతలు, కార్యకర్తలపై ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తుంటే... ఇతర న్యాయవాదులతో కలిసి వారికి పోలూరి అండగా నిలుస్తున్న తీరు అభినందనీయమన్నారు.
లీగల్ విభాగం రాష్ట్ర జోనల్ వర్కింగ్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనకు లభించింది అలంకారప్రాయమైన పదవి కాదని.. ఇదొక బాధ్యతన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వారి తరుపున రాజీలేని న్యాయ పోరాటానికి లీగల్ సెల్ ముందుంటుందన్నారు. తన నియామకానికి కృషి చేసిన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌రెడ్డి, అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్‌కుమార్, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సీఈసీ సభ్యులు మంద పాటి శేషగిరిరావు, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, ఉమ్మడి గుంటూ రు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, న్యాయవాదులు పోకల వెంకటేశ్వర్లు, వేముల ప్రసాద్, మంజుల, శ్యామల, వెంకటరమణ, చల్లా క్రాంతి, వినయ్, బాబూరావు, కాసు వెంకటరెడ్డి, సుదర్శన క్రాంతి, కల్లం రమణారెడ్డి, వాసం సూరిబాబు, సయ్యద్ బాబు, విన్ని, సీహెచ్ సౌజన్య, చందు చంద్రశేఖర్‌రెడ్డి, బాలాజీ చక్రవర్తి, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, షేక్ రోషన్, యక్కలూరి కోటిలింగారెడ్డి, పడాల సుబ్బారెడ్డి, బోడపాటి కిషోర్, అచ్చాల వెంకటరెడ్డి, ఓర్సు శ్రీనివాసరావు, సురసాని వెంకటరెడ్డి, షేక్ రబ్బానీ, యేరువ నర్సిరెడ్డి పాల్గొన్నారు.


