విజ్ఞాన్‌లో ఆకట్టుకున్న శాసీ్త్రయ నృత్య ప్రదర్శన
చేబ్రోలుః చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో భారతీయ సంప్రదాయ కళలను విద్యార్థులకు చేరువచేసే లక్ష్యంతో శాసీ్త్రయ నృత్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్ సోమవారం తెలిపారు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగం, డీన్–స్టూడెంట్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శాసీ్త్రయ నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ భరతనాట్య నృత్య కళాకారిణి డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ ప్రత్యేక శాసీ్త్రయ నృత్య ప్రదర్శన చేశారు. భారతీయ శాసీ్త్రయ నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన కళాకారిణిగా డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్‌కు విశేషమైన పేరు ఉందని వైస్ చాన్స్‌లర్ తెలిపారు. డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని అనేక ప్రతిష్ఠాత్మక వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శాసీ్త్రయ నృత్య వైభవాన్ని తిలకించారు.
ప్రపంచ ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి డాక్టర్ బాలాదేవి చంద్రశేఖర్ ప్రత్యేక ప్రదర్శన


