అవినీతి మరక లేని వ్యక్తి అటల్‌జీ
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
గుంటూరు మెడికల్: సమైక్య వాదంతో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయాలు చేశారని, ఆయన అవినీతి మరక లేని వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు లక్ష్మీపురం కూడలిలో ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహావిష్కరణ ఆదివారం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ సర్కిల్‌ను వాజ్‌పేయ్ సర్కిల్‌గా నామకరణం చేస్తున్నామని చెప్పారు. విభిన్న సిద్ధాంతాలున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారని వెల్లడించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్‌పేయి దేశం గర్వించే మహోన్నత నాయకుడని కొనియాడారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మంచి పరిణామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ,అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రాష్ట్ర కన్వీనర్ నాగోతు రమేష్ నాయుడు, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


