ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Jan 5 2026 10:55 AM | Updated on Jan 5 2026 10:55 AM

ముదిర

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి వైభవంగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోడ్డు ప్రమాదంలో చిరుద్యోగి మృతి

నెహ్రూనగర్‌: ఆంధ్రప్రదేశ్‌లో ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. సంపత్‌నగర్‌లో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్‌ కమ్యూనిటీ భవన్‌ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్‌ పదవుల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో ముదిరాజ్‌ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్‌, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. ఆదినుంచి భగవంతుడు తన పవిత్రగంథం ద్వారా తన కుమారుడు భూమిపై లోక రక్షకుడిగా జన్మిస్తాడని తెలిపారన్నారు. పరలోక రాజ్యం యూదులకే కాదని ప్రతి ఒక్కరికి ఉందని.. అందుచేతనే దీనిని ముగ్గురు రాజుల పండుగగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు భూమిపై ప్రతి ఒక్కరిని రక్షించేందుకు జన్మించాడన్నారు. సత్యం తెలియజేసేందుకు గాను మానవుడిగా క్రీస్తు జన్మించి దానిని ప్రతి ఒక్కరికీ తెలియజేసినట్లు చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. సహాయ విచారణ గురువులు సాగర్‌, మఠకన్యా సీ్త్రలు, సోడాలిటీ సభ్యులు, ప్యారిష్‌ కౌన్సిల్‌, గుడిపెద్దలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్‌ జాతీయ రహదారి, కుంచనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన కామినేని భవానీశంకర్‌ (33) కుటుంబ జీవనోపాధి కోసం విజయవాడలోని ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి స్టాక్‌ రావడంతో వాటిని చూసుకొని 12 గంటల తరువాత ఇంటికి వెళుతుండగా 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కారు భవానీశంకర్‌ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో భవానీ శంకర్‌కు తీవ్ర గాయాలుకాగా, కారులో వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తాడేపల్లి పోలీసులు అక్కడి నుండి తీసుకువచ్చి విచారణ చేపట్టారు.

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి 1
1/2

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి 2
2/2

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement