గంటల వ్యవధిలో దంపతులు మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని పెనుమాక గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అయిన భార్యభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పెనుమాక పార్టీ అధ్యక్షుడు మేకా శివారెడ్డిలు నాయకులతో కలిసి వెళ్లి వారి భౌతికకాయాలకు నివాళులర్పించారు. వివరాలు.. పెనుమాకకు చెందిన షేక్ సిద్ధా సాహెబ్ (70), భార్య షేక్ సైదాబి (65) దంపతులు. గురువారం రాత్రి భార్య కాలు జారి కిందపడింది. ఆమెను ఇంట్లోకి తీసుకువచ్చి సపర్యలు చేసిన భర్త ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఆరు గంటల వ్యవధిలో భార్య కూడా మృతి చెందింది. వాకి కుమారుడు మస్తాన్ వలి అంత్యక్రియలు నిర్వహించారు. దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అంటే దంపతలుకు ఎంతో అభిమానమని గుర్తుచేసుకున్నారు. ప్రతి సంవత్సరం వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారని, అలాంటి అభిమానులు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పచ్చల విజయకుమార్, మేకా దామేష్‌రెడ్డి, భుజంగరావు, మేకా అంజిరెడ్డి, అల్లూ శ్రీనివాసరెడ్డి, ఎస్‌కే సుభాని, బషీర్, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 104 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ అన్నారు. శనివారం వైద్యరంగ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పీహెచ్‌సీ సెంటర్‌ల వద్ద డిమాండ్స్‌తో కూడిన పోస్టర్లు అంటించి యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ అరకొర వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు గ్రాడ్యూటీ, ఎర్న్ లీవ్‌ల డబ్బులు నేటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు ఏడుకొండలు, సాయిరాం, బాలకృష్ణ, హరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
గంటల వ్యవధిలో దంపతులు మృతి


