మల్లేశ్వరస్వామి సేవలో న్యాయమూర్తులు
పెదకాకాని: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జి.స్రవంతి, చిలకలూరిపేట కోర్టు న్యాయమూర్తి ఐ.స్వాతి దంపతులు విచ్చేశారు. ఆదివారం పెదకాకాని శివాలయానికి వచ్చిన అతిథులకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమ రాంబ మల్లేశ్వరస్వామిని వారు దర్శించుకుని పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అతిథులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివిధ శాఖల అధికారులు తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు. స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా వారిని సత్కరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆయా శాఖల అధికారులు శివాలయానికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 5,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్‌కి 276, బ్యాంక్ కెనాల్ 1,304, తూర్పు కాలువకు 184, పశ్చిమ కాలువకు 52, నిజాంపట్నం కాలువకు 159, కొమ్మూరు కాలువకు 2,780 క్యూసెక్కులు విడుదల చేశారు.
మల్లేశ్వరస్వామి సేవలో న్యాయమూర్తులు


