హంస వాహనంపై నృసింహస్వామి
మంగళగిరి టౌన్: చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శనివారం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు గ్రామోత్సం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హంస వాహనంపై స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యం పొందారు. హంస వాహనంపై స్వామి ఆలయం చుట్టూ విహరించారు. చైత్ర పౌర్ణమి నాడు హంస వాహనంపై స్వామి దర్శనం చేయడం భక్తులకు పవిత్ర అనుభవమని అర్చకులు తెలియజేశారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన వేదాంతం వెంకట రమణాచార్యులు కుమారులు వ్యవహరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు.


