తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహా బదిలీ
తెనాలిరూరల్: తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహా బదిలీ అయ్యారు. ఆమెను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సంజనా సింహా ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేశారు. సివిల్స్ పరీక్షల్లో మూడో పర్యాయం 201 ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. నాలుగో ప్రయత్నంలో 37వ ర్యాంకు సాధించి తాను కలలుగన్న ఐఏఎస్‌ను అందుకున్నారు. నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తిచేసుకున్నాక, ఆమె ను విద్యుత్ శాఖలో కార్యదర్శిగా నియ మించారు. 2024 ఆగస్ట్ 25న తెనాలి సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి సమర్థంగా పనిచేస్తూ వచ్చారు.తెనాలి శాలిపేట లో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఐటీపీ సెక్షన్ 18 కింద సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. తెనాలి ప్రాంతంలో వ్యభిచార గృహాన్ని ఏడాదిపాటు సీజ్ చేయించిన తొలి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
గుంటూరు నగర కమిషనర్‌గా మయూర్ అశోక్
నెహ్రూనగర్:గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె మయూర్ అశోక్‌ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా గుంటూరు నగర కమిషనర్‌గా పనిచేస్తున్న పులి శ్రీనివాసులును మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె మయూర్ అశోక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంక్రాంతి తరువాత నూతన కమిషనర్ విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహా బదిలీ


