1857లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం కంటే ముందే జిల్లాలోని నాదెండ్ల సమితిలో నాగలి సమ్మె జరిగింది. అప్పట్లో కృష్ణాజిల్లాలో ఉన్న గుంటూరు ప్రాంతంలో కరువు తాండవించింది. పన్ను బకాయిల వసూళ్ల కోసం ఆస్తుల జప్తునకు బ్రిటిష్ పాలకులు సిద్ధపడ్డారు. తిరగబడిన రైతులు నాగలి, గొర్రు, గుంటక, పలుగు, పార మంచైపె పెట్టి వ్యవసాయం మానేసి, చేతిపనివారితో సహా సమ్మె చేశారు. పాలకులు దిగొచ్చి పన్నులను రద్దుచేశారు. గ్రామీణ శ్రామిక జనాలు సమైక్యంగా పోరాడిన తొలి సంగ్రామ ఘట్టమిది.


