Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి

Union Budget 2023: Middle Class Memes Flood Internet - Sakshi

సారాంశం: సరికొండ చలపతి

బడ్జెట్‌  ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్‌ మాత్రం తెస్తోంది.
....
మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... 
‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్‌ చేస్తావ్‌ నాన్నా, ఈ ఫోన్‌ చూడు.’
– ... దీనికి ఏమైందిరా?
‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్‌? రోజుకు 50 సార్లు హ్యాంగ్‌ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్‌ అవుతోంది.’
– ...అవును, కానీ మంచి ఫోనురా...
‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’
– .. సరే, చూద్దాం...
 ఆ  తర్వాత  రోజు..
‘ఫోన్‌ సంగతి  ఏమైంది నాన్నా...’
– సరే ఫస్ట్‌కు  చూద్దాం...
ఓ నెల తర్వాత..
‘..ఫొటోస్, ఫైల్స్‌  మిస్సవుతున్నాయి నాన్నా..’
– ..ఏదీ చూద్దాం.. 
‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్‌  కొను నాన్నా.
– ..అలాగే చూద్దాం..
మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట!


కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు  కొనివ్వకపోతాడా...అని.
విచిత్రం ఏమిటంటే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ కూడా అంతే..
ఈసారైనా బడ్టెట్‌లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా..
కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది..

నెక్స్‌ట్‌ బడ్జెట్‌లో చూద్దాం.. అని.
అందుకే ప్రతి బడ్జెట్‌లో శాలరీ శ్లాబ్‌లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం..
నెక్స్‌ట్‌ బడ్జెట్‌ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస

సరే చూద్దాం.. ఈ బడ్జెట్‌లో ఎలా ఉంటదో.
 వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్‌ మొన్నీమధ్య మాట్లాడుతూ–
..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ  మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్‌వైపు ఆశగా చూస్తోంది.

‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్‌ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్‌ సరదా  కామెంట్‌.

కానీ, ఓ నెటిజన్‌ సీరియస్‌  కామెంట్‌ చూడండి..
‘‘సమాజాన్ని స్టేబుల్‌గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్‌ క్లాస్‌కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్‌ చేసేదే.. మిడిల్‌క్లాస్‌. గత న లభై ఏళ్లుగా మిడిల్‌ క్లాస్‌ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని  ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్‌లో సరైన సపోర్ట్‌ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’

దీనికి సపోర్ట్‌గా మరో నెటిజన్‌  పొలిటికల్‌ అనాలసిస్‌ ఇదీ..
‘‘సాధారణంగా పాలిటిక్స్‌కు, ఓటింగ్‌కు  దూరంగా ఉండే మిడిల్‌ క్లాస్‌ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు  మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా,  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా 
మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి,  సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్‌ నడిపిస్తోన్న  హిందుత్వాన్ని  బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్‌ లేకుండా మోదీ విజన్‌ సాధ్యం కాదు..  గతంలో కంటే  మిడిల్‌ క్లాస్‌ పాపులేషన్‌ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్‌ను విస్మరించడం మోదీ గవర్నమెంట్‌కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’

విద్య, వైద్యం, దైనందిన జీవితంలో  పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్‌ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్‌ ఇలా పంచుకున్నారు..
‘‘మా నాన్న ఫ్రెండ్‌ ఓ స్టాక్‌ బ్రోకర్‌.  ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన  సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు.
ఇప్పటికి  వాటి ధర  200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి..
కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్‌ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది.
ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి.  
కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్‌ సర్జరీ కోసం అమ్ముకున్నాం.
మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి.
కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి..
ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది.

నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే  మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్‌ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్‌గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్‌.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది,  శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్‌లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. 
వీటన్నింటినీ బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకోవాలి...’


ఇదీ ఉద్యోగుల పరిస్థితి

బడ్జెట్‌ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకట­నపై  ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు

సరే చూద్దాం..
ఈసారి బడ్జెట్‌ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్‌ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-02-2023
Feb 04, 2023, 13:57 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్‌ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్‌...
03-02-2023
Feb 03, 2023, 03:59 IST
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌...
02-02-2023
Feb 02, 2023, 10:48 IST
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు...
02-02-2023
Feb 02, 2023, 10:33 IST
కేంద్ర బడ్జెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు...
02-02-2023
Feb 02, 2023, 09:11 IST
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు!  ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్‌ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్‌ అని.....
02-02-2023
Feb 02, 2023, 06:29 IST
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా...
02-02-2023
Feb 02, 2023, 06:01 IST
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్‌లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు....
02-02-2023
Feb 02, 2023, 05:53 IST
న్యూఢిల్లీ: అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్‌ ఇదేనంటూ బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్‌ వేసిన...
02-02-2023
Feb 02, 2023, 05:47 IST
న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు...
02-02-2023
Feb 02, 2023, 05:32 IST
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు...
02-02-2023
Feb 02, 2023, 04:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్‌లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు...
02-02-2023
Feb 02, 2023, 04:40 IST
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ విశాఖపట్నం రైల్వే జోన్‌ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
02-02-2023
Feb 02, 2023, 04:26 IST
న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం...
02-02-2023
Feb 02, 2023, 04:09 IST
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.....
02-02-2023
Feb 02, 2023, 04:00 IST
నిధులివ్వలేదు.. గ్యారెంటీ లేదు.. ప్రాజెక్టుల ఊసు లేదు.. ఏ గ్రాంటు కిందా కేటాయింపులు లేవు.. రెండు మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో...
02-02-2023
Feb 02, 2023, 03:47 IST
ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్‌ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా...
01-02-2023
Feb 01, 2023, 19:27 IST
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ).. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది...
01-02-2023
Feb 01, 2023, 19:22 IST
2023-24 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన...
01-02-2023
Feb 01, 2023, 18:17 IST
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్‌లో  కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా...
01-02-2023
Feb 01, 2023, 17:09 IST
వచ్చే ఏడాదిలో ఎన్నికలు. కాబట్టి, ఇదే చివరి బడ్జెట్‌. పేదమధ్యధనిక వర్గాలు ఎన్నో అంచనాలు.. 



 

Read also in:
Back to Top