అమూల్‌ ఒప్పందంతో పల్లెల్లో పాలవెల్లువ

AP Government Agreement With Amul Milk - Sakshi

కరోనా వచ్చిన తరువాత ఇంచు మించు అన్నిరంగాలు తీవ్ర ఒడి దొడుకులకు లోనయ్యాయి. ఒక్క వ్యవసాయంలోనే  చిన్నచిన్న అవాం తరాలు ఏర్పడినా ప్రభుత్వం తీసు కున్న పలురకాల నిర్ణయాలతో నిరం తర ప్రవాహంగా సాగుతోంది ఒక్క వ్యవసాయమే. దీని మీద ఆధారపడే అన్ని రంగాలవారు పెద్దగా ఇబ్బం దులు ఎదుర్కొనలేదనే చెప్పాలి. అలాంటి వ్యవసాయ రంగాన్ని మరింత పటిçష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను సైతం లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పాల విప్లవానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందుకు అమూ ల్‌తో చేసుకున్న ఒప్పందం ఒకటి. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పలు రకాల ప్రయోజనాలు అందనున్నాయి.

అమూల్‌ కంపెనీ కాదు
అమూల్‌ అనగానే చాలామంది దానిని కార్పొరేట్‌ కంపెనీ అనుకుంటారు. అది ఒక డెయిరీ కో ఆపరేటివ్‌ సొసైటీ. సహ కార సంఘం పేరు అమూల్‌ కాదు. కైరా డిస్ట్రిక్ట్‌ కోపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (కేడీసీఎంపీ యూఎల్‌). దీనిని గుజరాత్‌లోని ఆనంద్‌లో 1946లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి ఒక ఏడాది ముందు అంటే బ్రిటిష్‌ హయాంలోనే దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సంఘంలో వచ్చిన లాభాలు డివిడెంట్‌ రూపంలో పాల ఉత్పత్తిదారులకు (పాడి రైతులకు) మాత్రమే అందుతాయి. అదే ప్రైవేట్‌ డెయిరీలు అయితే లాభాలు తమ వద్ద ఉంచుకుంటాయి. ఒక సహకార సంఘం ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందడం అసాధ్యం. కానీ దీనిని సాధ్యం చేసింది మాత్రం స్వాతంత్య్ర సమరయోధుడు త్రిభువన్‌దాస్‌ పటేల్, డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌లు. గుజ రాత్‌లో పాడి రైతుల కష్టాలను, నష్టాలను చూసిన వీరు అమూల్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరించే ప్రైవేట్‌ కంపెనీలు లాభాలను వారు మాత్రమే పొందేవారు. దీనిని అమూల్‌ బద్దలుకొట్టింది. అమూల్‌ వచ్చిన తరువాత పాడి రైతులకు లాభాలు అందాయి. నిజంగా ఇదొక విప్లవం. దేశంలో పాల విప్లవానికి అమూల్‌  పునాదులు వేసింది. ప్రపంచంలో పాల దిగుబడిలో మన దేశం అమెరికాను దాటి ప్రథమస్థానంలో నిలిచింది. పాడి రైతులకు లాభాలను అమూల్‌ చూపిం చింది. సర్దార్‌ పటేల్‌ స్వప్నం మేరకు ప్రతీ గ్రామంలోను పాడిరైతులతో సొసైటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. అమూల్‌ రాకముందు గుజరాత్‌లో పెస్తోన్జీ అనే వ్యక్తి పెట్టిన పోల్సన్‌ కంపెనీ ఉండేది. ఇది గుజరాత్‌ రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే పాలను సేకరించి ముంబైలో అధిక ధరలకు విక్రయించేది. లాభాలు పంచడం దేవుడెరుగు, తన స్వలాభం కోసం రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకుండా చేసింది.

అమూల్‌ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు
అమూల్‌ స్ఫూర్తితో ఇంచుమించు ప్రతీ రాష్ట్రంలో  కో ఆపరేటివ్‌ డెయిరీలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో డెయిరీలు చాలా విజయ వంతంగా నడిచాయి. చిత్తూరు, విశాఖ, విజయ, గోదావరి డెయిరీలు అటువంటివే. ఇవన్నీ కో ఆపరేటివ్‌ డెయిరీలుగా వచ్చాయి. అయితే రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న నయా పెస్తోన్జీలు (చంద్రబాబు) స్వలాభాల కోసం.. తమ సొంత కంపెనీల ఎదుగుదల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. నష్టాల బాటలు పట్టించి కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కొన్ని డెయిరీలను నిర్వీర్యం చేయడం ద్వారా తమ సొంత ప్రైవేట్‌ డెయిరీలు కోట్ల రూపాయల మేర లాభాలు పొందే విధంగా చూసుకున్నారు.

జగన్‌ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆశించిన విధంగానే పాల డెయిరీలు రైతుల చేతుల్లో ఉండాలని బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. పాల ఉత్పత్తిదారులతో గ్రామాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయనుంది. వారి ద్వారా పాలను సేకరించడం, పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మకాలు చేయడం ద్వారా వచ్చిన లాభాలను రైతు లకు డివిడెండ్‌ రూపంలో అందజేస్తారు. ఇలా చేయడం ద్వారా మన రాష్ట్రంలో పాడి రైతులు లాభాలు పొందే అవ కాశముంది. ఇప్పటి వరకు రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలను విక్రయాలు చేయడం ద్వారా ఆదాయం పొందుతున్నారు కానీ... డెయిరీల ద్వారా వచ్చే లాభాలను రైతులు పొంద లేకపోతున్నారు. లాభాలన్నీ ప్రైవేట్‌ కంపెనీలు పొందు తున్నాయి.

ఉత్పత్తి చేస్తున్న పాలకు సరైన ధర రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. పెరిగిన మేత, డెయిరీల నిర్వహణ ధరలకు అనుగుణంగా పాల ధరలు పెరగడం లేదన్నది రైతుల ఆవేదన. ఇదే విషయంపై ఎన్నికలముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పాడి రైతులకు మేలు చేసే నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. సహకార డెయిరీలకు పాలు విక్రయిస్తే రైతులకు లీటరుకు రూ.2 చొప్పున బోనస్‌ ఇస్తానన్న విషయం తెలిసిందే. అమూల్‌ వచ్చిన తరువాత పాల ధరలు పెరిగే అవకాశముంది. అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చి పల్లెల్లో పాల ఉత్పత్తి ఉరకలు వేయ నుంది. వ్యవసాయం లాభసాటి కావాలంటే పంటలతో పాటు పాడి ఉండాలని నాడు దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, నేడు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. దీనిలో భాగంగానే అమూ ల్‌తో ఒప్పందం. అలాగే గ్రామ సచివాలయాలలో వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నియమించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలవెల్లువకు ఆయన బాటలు వేశారు. త్వరలో రాష్ట్రంలో 7 వేల పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అవి కూడా మహిళ లతో ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాలకు పాల కొనుగోళ్లను అనుసంధానం చేయను న్నారు. ఈ విధంగా గ్రామీణ రైతులు, మహిళల ఆదాయం పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బల మైన పునాదులు వేస్తున్నారని చెప్పవచ్చు.

వ్యాసకర్త ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు
మొబైల్‌ : 98483 91234 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top