భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది.
Photo Courtesy: Mv Werften
జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి.
Photo Courtesy: Mv Werften
తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు.
Photo Courtesy: Mv Werften
దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది.
చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!