'ఇడియట్‌ సిండ్రోమ్‌' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..? | Sakshi
Sakshi News home page

'ఇడియట్‌ సిండ్రోమ్‌' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?

Published Wed, May 15 2024 6:18 PM

What Is IDIOT Syndrome How Internet Searches Can Hinder Your Health

రోజుకో కొత్త సిండ్రోమ్‌లు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషుల పిచ్చి అపోహాలు, నమ్మకాలే వ్యాధుల రూపంలో సిండ్రోమ్‌లుగా బయటకొస్తున్నాయి. అలాంటి సరికొత్త సిండ్రోమ్‌ ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దానిపేరే 'ఇడియట్‌ సిండ్రోమ్‌'. ఏంటీ సిండ్రోమ్‌? ఎందువల్ల వస్తుందంటే..?

'ఇడియట్‌' అంటే "ఇంటర్నేట్‌ డెరైవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్ర్స్టక్షన్‌ ట్రీట్‌మెంట్‌". ఈ సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ హెల్త్‌ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చి స్వీయ చికిత్స తీసుకుంటారు. అనారోగ్యాన్ని నిర్థారించుకోవడానికి పూర్తిగా ఆన్‌లైన్‌ వనరులనే ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితిని "ఇడియట్‌ సిండ్రోమ్‌"అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్‌  ఉన్న రోగులు ఇంటర్నెట్‌ సర్చ్‌ల ఆధారంగా వ్యాధులను స్వయంగా నిర్థారణ చేసుకుంటారు. 

ఆఖరికి డాక్లర్లు సూచించిన చికిత్సలను కూడా పక్కన పెట్టేసి వారు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకున్న చికిత్సను స్వయంగా చేసుకోవడం, ఆ మందులనే వాడడం వంటివి చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తులు రోగ నిర్థారణ కోసం వెబ్‌ శోధనే సరియైనదని భావించడమే ప్రమాదం. డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని 'ఇన్ఫోడెమిక్‌' అని పిలుస్తుంది. 

ఈ విధమైన తీరు రాను రాను మరింత తీవ్రమై వైద్య నిపుణలపై అమనమ్మకానికి దారితీస్తుంది. రోగులు ఇక్కడ ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌ వంటి సాంకేతికతో తెలుసుకోవడం వరకు మంచిదే తప్పులేదు. అదే సాయంతో తనకు తానుగా ట్రీట్‌మెంట్‌​ తీసుకోవడం అనేది ప్రమాదకరం అని వైద్యుల చెబుతున్నారు. 

ఆరోగ్యానికి ఎలా ప్రమాదమంటే..

  • ఈ విధానం ముదిరిపోతే వారి దృష్టిలో ఆన్‌లైన్‌  హెల్త్‌ సమాచారమే తిరుగలేనిదిగా కనిపిస్తుంది. నిరంతరం ఆన్‌లైన్‌ సెర్చ్‌లకే పరిమితమైపోతారు. దీంతో విపరీతమైన, ఆందోళనకు, ఒత్తిడికి  గురవ్వుతారు.

  • ఒకవేళ్ల అది ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వచ్చి  ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. 

  • ఈ వైఖరి వైద్య సహాయాన్ని నిరాకరించే స్థితికి తీసుకొస్తుంది. 

  • అప్పటి వరకు వాడుతున్న మందులను కూడా ఆపేయడం లేదా వేనే వాటిని వాడేలా చేస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, లేనిపోని అనారోగ్యల బారినపడతారు.

  • ఇక్కడ వెబ్‌ అనేది ఒక సాధనం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరుచుకోండి తప్పులేదు. శృతిమించితేనే ప్రమాదం. రోగ నిర్థారణ, చికిత్సల సలహాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం అని గ్రహించండి. 

(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)
 

Advertisement
 
Advertisement
 
Advertisement