హాయిగా కూర్చునే బరువు తగ్గొచ్చు..

Weight Loss With Portable Personal Steamer - Sakshi

బ్యూటీజర్‌

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు ఆడవారికి ఇంటిపనితో పాటు ఆఫీస్‌ ఒత్తిడి పెరిగిపోవడం లేదా శరీరంపై శ్రద్ధ తగ్గడంతో బాడీలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పేరుకుపోతూ ఉంటుంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, పిరుదులు, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్‌లెస్‌గా మారిపోతుంటారు చాలా మంది. అతి తక్కువ సమయంలో స్లిమ్‌గా, నాజుగ్గా మారాలంటే ఈ బ్యాగ్‌లో చక్కగా ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటే సరి. అదే ఈ పోర్టబుల్‌ పర్సనల్‌ స్టీమర్‌ ప్రత్యేకత.

చిత్రంలోని మెషిన్‌తో పాటు ప్రత్యేకమైన టెంట్, ఒక చైర్‌(చిత్రంలో గమనించవచ్చు) లభిస్తాయి. టెంట్‌ ఓపెన్‌ చేస్తే.. గుడారంలా ఒక మనిషి పట్టేంత వైశాల్యంతో పెద్దగా ఓపెన్‌ అవుతుంది. అవసరం లేనప్పుడు మడిచి గుండ్రటి రింగ్‌లా చిన్న బ్యాగ్‌లో పట్టేవిధంగా మార్చేసుకోవచ్చు. (అచ్చం దోమలు రాకుండా వాడే నెట్‌ టెంట్‌ మాదిరి ఫోల్డ్‌ చేసుకోవచ్చు). టెంట్‌ వాటర్‌ ప్రూఫ్‌ కావడంతోపాటు వాటర్‌ లీక్‌ కాకుండా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. దీనికి రెండు వైపులా జిప్‌ ఉంటుంది.

ఇక స్టీమర్‌లో ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో వాటర్‌ పోసుకుని దాని ముందు భాగంలో ఉన్న డిస్‌ప్లేలో ఆప్షన్స్‌ సెట్‌ చేసుకోవచ్చు. దీన్ని రిమోట్‌ ద్వారా కూడా ఆపరేట్‌ చేసుకోవచ్చు. స్టీమర్‌కి, టెంట్‌కి కనెక్షన్‌ ఉంటుంది. లోపలికి ఆవిరి వెళ్తూ.. బాడీ మొత్తానికి స్పా అవుతుంది. దీనిలో స్పా చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు.. జాయింట్‌ పెయిన్స్‌ తగ్గడం, మజిల్స్‌ స్టిఫ్‌గా మారడం, మానసిక ఒత్తిడి తగ్గడం.. రక్తప్రసరణ బాగా జరగడం, ఎనర్జీలెవల్స్‌ పెరగడం, చర్మం కాంతిమంతంగా మారడం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ స్టీమర్‌తో పాటు అదనంగా  2 కనెక్షన్‌ పైప్స్, ఒక ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్, క్యారీ బ్యాగ్‌ లభిస్తాయి. దీని ధర సుమారు 90 డాలర్లు. అంటే సుమారు 6,600 రూపాయలు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top