ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్‌లో సగభాగం స్విచ్‌ఆఫ్‌ అయ్యింది? ఐనా..

US Doctors Disconnect Half Brain Of 6 Year Old Girl  - Sakshi

మెదడులో సగభాగాన్ని స్విచ్‌ఆఫ్‌ చేయడం గురించి విన్నారా?. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఏదో ఎలక్ట్రిక్‌ స్విచ్‌ని ఆఫ్‌ చేసినట్లుగా ఓ ఆరేళ్ల చిన్నారి మెదడుల సగభాగాన్ని స్విచ్‌ఆఫ్‌ చేశారు. ఎందుకిలా? ఏం జరిగింది ఆ చిన్నారికి తదితరాల గురించే ఈ కథనం.!

వివరాల్లోకెళ్తే.. యూఎస్‌లోని ఆరేళ్ల చిన్నారి బ్రియానా బోడ్లీ అరుదైన మెదడువాపు వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి పేరు రాస్ముస్సేన్‌కి సంబంధించిన మెదడువాపు వ్యాధి. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని రాస్ముస్సేన్స్‌ ఎన్సెఫాలిటిస్‌ అనే మెదడు వాపు వ్యాధి. దీని కారణంగా ఆమె పక్షవాతానికి గురయ్యి నడవలేనంత దయనీయ స్థితిలో ఉంది. కనీసం మాటలు కూడా పలకలేదు. ఈ వ్యాధి కారణంగా ఆమె మెదడులోని ఒక వైపు భాగం కుచించుకుపోవడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి  ఆమెపై ఓ రేంజ్‌లో విజృంభించడం ప్రారంభించింది.

దీంతో వైద్యలు ఆమె పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో యాంటీ సీజర్‌, స్టెరాయిడ్లు ఇచ్చారు. అంతేగాదు ఆ వ్యాధిని నయం చేసేందుకు మెదడులో ఒకవైపు భాగాన్ని పనిచేయకుండా డిస్‌కనెక్ట్‌ చేశారు. అంటే ఒకరకంగా ఒకవైపు మెదడుని స్విచ్‌ఆఫ్‌ చేశారు. ఆ చిన్నారి ఎదుర్కొంటున్న వ్యాధిని నయం చేసేందుకు ఇలా ఒకవైపు మెదడుని పూర్తిగా డిస్‌కనెక్ట్‌ చేసినట్లు లోమాలిండా యూనివర్సిటీ డాక్టర్‌ ఆరోన్‌ రాబిసన్‌ చెప్పారు. ఈ మేరకు వైద్యులు రాబిసన్‌ మాట్లాడుతూ..మెదడులో పనిచేయని భాగాన్ని సిల్వియన్‌ షిషర్‌ అనే పిలిచే బ్రెయిన్‌ ఓపెన్‌ సర్జరీ ద్వారా బ్రెయిన్‌ని ఆఫ్‌ చేయొచ్చని చెప్పారు.

ఈ చికిత్సలో తాము  మెదడులోని థాలమస్‌ ప్రాంతం నుంచి తెల్లటి పదార్థాన్ని రీమూవ్‌ చేస్తామని చెప్పారు. సగం మెదడుతో రోజూవారి సాధారణ జీవితాన్ని గడపగలమని చెప్పారు వైద్యులు. దీని గురించి ఆ చిన్నారి బ్రియానాకి దాదాపు 10 గంటలకు పైగా శస్త్ర చికిత్స చేసి మరీ మెదడులోని సగ భాగాన్ని డిస్‌కనెక్డ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ఆమె ఎడమ చేతిని కదపలేకపోవడం, కొంత మేర దృష్టిని సైతం కోల్పోయినప్పటికీ వివిధ ఫిజికల్‌ థెరఫీలతో మళ్లీ ఆమెను యథాస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొత్తగా నడవడం, బ్యాలెన్సింగ్‌ చేసుకోవడం వంటి నెపుణ్యాలను మళ్లీ అభ్యసిస్తోందని చెప్పారు రాబిసన్‌. 

ఇంతకీ రాస్ముస్సేన్‌ మెదడు వాపు వ్యాధి అంటే..
మెదడులో సగభాగంలో మంటతో కూడిన దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరితే సగభాగం పూర్తిగా పనితీరుని కోల్పోతుంది. దీంతో ఒక వైపు శరీరం చచ్చుబడి క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని 1958లో తొలిసారిగా వైద్యుడు థియోడర్‌ రాస్ముస్సేన్‌ వివరించారు. అందువల్ల ఆ వైద్యుడి పేరు మీదనే ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రతి పదిమిలియన్ల మందిలో ఇద్దర్ని ప్రభావితం చేస్తుందని, సాధారణంగా సుమారు 2 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, ఆఖరికి పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలు:

  • రాస్ముస్సేన్ ఎన్సెఫాలిటిస్ అత్యంత సాధారణ మూర్చలాంటి లక్షణాలనే చూపిస్తుంది. 
  • ఇది శరీరంలోని బలమైన కండరాల కదలికలను నియంత్రిస్తుంది. 
  • ఒక చేయి, కాలు మెలితిప్పినట్లుగా వంకరగా మారతాయి.
  •  మెదడులో ఒకవైపు నుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమవుతుంది

(చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top