పొట్ట, నడుము దగ్గర పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.. ధర రూ. 1,899 | Slimming Belt: How It Works Price And Other Details Here | Sakshi
Sakshi News home page

Slimming Belt: పొట్ట, నడుము, తొడల దగ్గర పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.. ధర రూ. 1,899

Mar 19 2022 4:04 PM | Updated on Mar 19 2022 4:34 PM

Slimming Belt: How It Works Price And Other Details Here - Sakshi

ఈ రోజుల్లో నాజూగ్గా ఉండటమే అసలైన అందం. ఎక్కడా ఇంచ్‌ ఎక్స్‌ట్రా కొవ్వు లేకుండా శరీరం ఓ ఆకృతిలో ఉంటేనే వేసుకున్న డ్రెస్‌కైనా .. కట్టుకున్న చీరకైనా అందమని చాలా మంది భావిస్తారు. ఛాయ తక్కువైనా, మొహం మీద మొటిమలూ.. మచ్చలూ  ఉన్నా, ఒంటి మీద నూగు మెరుస్తున్నా  కవర్‌ చేసుకోవడం సులభమే కానీ.. స్థూలకాయాన్ని కవర్‌ చేసుకోవడం కుదరదు. అందుకే చాలా మంది లావుగా ఉండటమే తమ అందానికి అసలైన సమస్యగా భావిస్తుంటారు.

అలాంటివారి కోసమే ఈ డివైజ్‌ (స్లిమ్మింగ్‌ బెల్ట్‌). 360 డబుల్‌ హెలిక్స్‌ సెంట్రిఫ్యూగల్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్‌.. బాడీలో కొవ్వును చాలా వేగంగా తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆటో అండ్‌ మాన్యువల్‌ డ్యూయల్‌ మోడ్‌ కలిగిన ఈ మెషిన్‌ను వినియోగించడం చాలా సులభం. వైబ్రేటెడ్‌ ట్యాపింగ్, బయోనిక్‌ మసాజ్‌తో నొప్పి లేకుండానే సమస్యను పరిష్కరిస్తుంది. పైగా దీన్ని ధరించడం వల్ల రిలాక్సింగ్‌గానూ ఉంటుంది. 

పొట్ట, నడుము, తొడలు, కాళ్లు, చేతులు.. ఇలా ప్రతిచోటా పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది ఈ మెషిన్‌. దీనికి చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. లావుని బట్టి..టైట్‌గా పట్టేందుకు బెల్ట్‌ను అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌కి ఎడమవైపు మోడ్స్, పవర్‌ బటన్, ఆన్‌/ఆఫ్, స్పీడ్‌ వంటి ఆప్షన్స్‌ ఉంటాయి. దీని ధర 25 డాలర్లు. అంటే 1,899 రూపాయలు. ఇది మీ వెంట ఉంటే.. సన్నజాజి సోకు మీదే మరి.  

చదవండి: Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement