అక్షరాల్లోకి... అంతరిక్ష యాత్ర | Second Orbit Book Authored By Shubhanshu Shukla | Sakshi
Sakshi News home page

అక్షరాల్లోకి... అంతరిక్ష యాత్ర

Jul 4 2026 8:40 AM | Updated on Jul 4 2026 8:40 AM

Second Orbit Book Authored By Shubhanshu Shukla

బుక్‌ షెల్ఫ్‌

మా యాత్ర ఇలా జరిగింది తెలుసా!

వ్యోమగాముల అంతరిక్ష యానానికి సంబంధించిన విశేషాలను అక్కడొకటి, ఇక్కడొకటి  చదివితేనే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది ‘మా యాత్ర ఇలా జరిగింది తెలుసా!’ అని కథ చెప్పినట్లుగా ఒక వ్యోమగామి చెబితే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది? ఆ ప్రయత్నమే చేశారు శుభాంశు శుక్లా. మన దేశపు అంతరిక్ష వీరుడు శుభాంశు శుక్లా రచయితగా మారారు!

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ (ఎఎఫ్‌ఎ) వంటి శిక్షణ కేంద్రాలలో రాణించి, టెస్ట్‌ పైలట్‌గా అనేక యుద్ధ విమానాలను నడిపిన శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆ చారిత్రక యాత్ర వెనక ఉన్న విషయాలను పాఠకులతో పంచుకోవడానికి ‘సెకండ్‌ ఆర్బిట్‌’ పేరుతో పుస్తకం రాశారు శుక్లా. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక వ్యక్తి సాధించిన ఘనతను కీర్తించేది కాదు.

అంతరిక్ష యాత్రను సాధ్యం చేసిన ఎంతోమంది కృషిని తలుచుకోవడం. శుక్లా రాసిన పుస్తకంలో ఇంజినీర్లు, ట్రైనర్‌లు, మిషన్‌ ప్లానర్‌లు, డాక్టర్‌లు, టెక్నిషియన్‌లు, తోటి వ్యోమగాములు, కుటుంబ సభ్యులు ప్రధాన పాత్రలు. ‘ఏ వ్యోమగామి ఒంటరిగా కక్ష్యలోకి చేరుకోలేడు’ అని చెప్పే పుస్తకం...సెకండ్‌ ఆర్బిట్‌. ఆక్సియమ్‌–4 మిషన్‌కు సంబంధించి తన ఎంపికను తెలియజేస్తూ తన జీవితాన్ని మార్చిన ఫోన్‌ కాల్‌ అందుకున్న క్షణాలను ఆసక్తికరంగా తెలియజేస్తారు శుక్లా. తన కమాండర్‌ను తొలిసారి కలవడం నుండి దాదాపు ఒక సంవత్సరం పాటు తీవ్రమైన శిక్షణ పొందడం వరకు...సంవత్సరాల తరబడి చేసిన ప్రయోగాలు, సన్నాహాలు, కొన్ని నిమిషాల్లో పరీక్షకు గురయ్యే ఉద్విగ్న క్షణాలు ఎలా ఉంటాయో చెబుతారు శుక్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement