ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా? | Scratching Head While Thinking Is A Form Of Somatosensory Activation | Sakshi
Sakshi News home page

ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా?

Jun 13 2026 11:26 AM | Updated on Jun 13 2026 11:54 AM

Scratching Head While Thinking Is A Form Of Somatosensory Activation

కిడ్స్‌ స్పెషల్‌

ఓ.. అవునా?

‘వినీష్‌... మన రాష్ట్రపతి పేరేంటి?’ అని టీచర్‌ అడిగితే వాడు లేచి బుర్ర గీరుకుంటాడు. శ్రేష్ఠ ఎగ్జామ్‌ రాస్తూ ఆన్సర్‌ గుర్తుకు రాక తల గీరుకుంటుంది.

ఎందుకు అలా తల గీరుకుంటారు?
మన చర్మం కింద లక్షల కొద్దీ నరాలు ఉంటాయి. తల గీరినప్పుడు ఆ నరాలు మెదడుకు మెసేజ్‌ పంపిస్తాయి. ఆ సిగ్నల్‌తో మెదడులో నిద్రపోతున్న భాగాలు యాక్టివేట్‌ అవుతాయి. అప్పుడు ఆలోచన వేగం పుంజుకుంటుంది. దీన్నే సైంటిస్టులు ‘సోమాటోసెన్సరీ యాక్టివేషన్‌’ అంటారు. తల గీరడం వల్ల అక్కడి చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.

రక్తంతో పాటు ఆక్సిజన్‌ కూడా మెదడుకు ఎక్కువగా అందుతుంది. ఆక్సిజన్‌ అందిన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఒక్కసారిగా సమాధానం గుర్తొస్తుంది. మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. సమాధానం దొరకకపోతే మెదడు పుస్తకాలు అన్నీ వెతుకుతుంది. ఆ సమయంలో బుర్ర గీరడం వల్ల మెదడుకు ఎక్స్‌ట్రా ఎనర్జీ అందినట్టు అవుతుంది. అందుకే సరైన జ్ఞాపకం టక్కున దొరుకుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే బుర్ర గోకడం అనేది అలసిపోయిన మెదడుకు మనం ఇచ్చే మసాజ్‌ లాంటిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement