Mutton Keema Cheese Samosa: మటన్‌ కీమా- చీజ్‌ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి!

Recipes In Telugu: How To Make Mutton Keema Cheese Samosa - Sakshi

ఆలూ సమోసా, ఆనియన్‌ సమోసా, కార్న్‌ సమోసా.. ఎప్పుడూ ఇలా రోటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన సమోసా రుచి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మటన్‌ కీమా– చీజ్‌తో సమోసా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి!

కీమా– చీజ్‌ సమోసా తయారీకి కావలసినవి:
►మటన్‌ కీమా – 1 కప్పు (కొద్దిగా మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి)
►మైదా పిండి – పావు కిలో, వాము – అర టీ స్పూన్‌
►చీజ్‌ తురుము – అర కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌
►రెడ్‌ చిల్లీ సాస్‌ – 1 టీ స్పూన్, సోయాసాస్‌ – 2 టీ స్పూన్లు
►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, పెరుగు – 1 టేబుల్‌ స్పూన్‌
►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా
►ఉప్పు – తగినంత

తయారీ:
►ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
►అందులో కీమా, రెడ్‌ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి.
►అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి.
►స్టవ్‌ ఆఫ్‌ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతీ ముద్దలా కలుపుకోవాలి.
►దీనిని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
►ఆ ముద్దను చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి.
►పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల కొద్దిగా కీమా మిశ్రమాన్ని, కొద్దిగా చీజ్‌ తురుము పెట్టి.. అంచులు మూసేయాలి.
►అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.  

ఇవి కూడా ట్రై చేయండి: Kala Mutton Recipe Telugu: కాలా మటన్‌ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top