Best Mutton Recipes: How To Prepare Kala Mutton Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Kala Mutton Recipe Telugu: కాలా మటన్‌ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!

Jul 8 2022 12:59 PM | Updated on Jul 8 2022 1:41 PM

Recipes In Telugu: How To Make Kala Mutton In Simple Way - Sakshi

ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్‌. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్‌ అజ్‌ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్‌ తయారీ విధానం మీకోసం..

కాలా మటన్‌
కావలసినవి:
మటన్‌ – ముప్పావు కేజీ
గ్రీన్‌ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు
పసుపు – అరటీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – కప్పు
ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు
నూనె – ఐదు టేబుల్‌ స్పూన్లు
ధనియాలు – టేబుల్‌ స్పూను
గసగసాలు – టేబుల్‌ స్పూను
యాలుక్కాయలు – నాలుగు
దాల్చిన చెక్క – అంగుళం ముక్క
లవంగాలు – ఐదు
మిరియాలు – ఐదు
సోంపు – టేబుల్‌ స్పూను
ఎండు మిర్చి – నాలుగు
ఎండుకొబ్బరి తురుము – అరకప్పు
బిర్యానీ ఆకు – ఒకటి
షాజీరా – టీస్పూను
వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
అల్లం తరుగు – టేబుల్‌ స్పూను
బంగాళ దుంపలు – రెండు
చింతపండు గుజ్జు – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ:
మటన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్‌ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి.
దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి.
తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌ మీద బాణలి పెట్టి టేబుల్‌ స్పూన్‌ నూనె వేయాలి.
వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి.  
దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్‌ రంగు వచ్చేంతవరకు వేయించాలి.
ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి.
నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి.
తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి.
ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి.  
దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్‌ మిశ్రమం వేయాలి.
ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్‌ కేన్‌ ష్రింప్‌ తయారీ ఇలా!
Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్‌.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement