ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ రెడీ చేస్కోండి!

Potassium Vitamin B And C Banana Kiwi Smoothie Preparation Tips In Telugu - Sakshi

కావలసినవి:
పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్‌ స్పూన్లు, లేత పాలకూర  – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్‌ – కప్పు. 

తయారీ: 
అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి 

పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి 

ఇప్పుడు బ్లెండర్‌ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్‌ చేయాలి  
చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం

అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్‌ వేసి మరొసారి గ్రైండ్‌ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్‌ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.  

తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్‌ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. 

విటమిన్‌ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. 

పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. 

అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి.  
చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top