పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ | PM Modi Meets Diljit Dosanjh Video Goes Viral | Sakshi
Sakshi News home page

పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ

Jan 2 2025 11:19 AM | Updated on Jan 2 2025 11:26 AM

PM Modi Meets Diljit Dosanjh Video Goes Viral

ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జిత్‌ దోసాంజ్‌. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ  'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఆయన పాటలకు సాధారణ ప్రజలే కాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభిమానే. 

ఇటీవల ఆయనకు దిల్జిత్‌ దోసాంజ్‌ని కలుసుకునే అవకాశం లభించింది. ఆ మధర క్షణానికి సంబంధించిన వీడియోని న్యూ ఇయర్‌ రోజున పోస్ట్‌ చేస్తూ తమ మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు. ఆ వీడియోలో..గాయకుడు దిల్జిత్‌ ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ తన తల్లి గంగానది గురించి మాట్లాడిన విధానం అందరినీ కదిలించింది అని దోసాంజ్‌ అన్నారు. 

ఆ తర్వాత మోదీ దోసాంజ్‌ని "మీ తల్లిదండ్రులు పెట్టిన దిల్జిత్‌(హృదయాల విజేత) అనే పేరుని సార్థకం చేసుకునేలా జీవస్తున్నారని అభినందించారు. ఒక పల్లెటూరు కుర్రాడు నేడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నాడు". అని ప్రశంసించారు. అంతేగాదు దోసాంజ్‌ని సదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలుచుకుంటూనే ఉన్నారని అన్నారు. 

ఇక ఆ సంభాషణలో దోసాంజ్‌ చిన్నప్పుడు పుస్తకాల్లో భారతదేశం ఎంతో గొప్పదని మాత్రమే చదువకున్నాను, కానీ అలా ఎందుకంటారనేది తాను దేశమంత పర్యటించినప్పుడే తెలిసిందన్నారు. అందుకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ అతి పెద్ద భారతవని మనకొక బలం, పైగా ఇది అత్యంత శక్తిమంతమైన సమాజం అని అన్నారు. ఆ సమావేశంలో ఇరువురు సంగీతం, యోగా ప్రయోజనాలు గురించి మాట్లాడారు. అనంతరం గాయకుడు గురునానక్‌పై భక్తి గీతాన్ని ఆలపించారు. 

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ మారింది. కాగా,మోదీ, దోసాంజ్‌లు సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఈ సమావేశం గురించి రాశారు. మోదీ దోసాంజ్‌ని ప్రతిభను, సంస్కృతిని మిళితం చేశాడని రాయగా, దోసాంజ్‌ ఇది మరుపురాని సమావేశం అని, సంగీతం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నామని రాశారు. 

 

(చదవండి: ఇంతులు ధరించడం వల్లే వెయిట్‌ పెరిగేది..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement