ఆరు నెలలు అక్కడ సూర్యుడే రాడు | place with six months darkness svalbard arctic polar night | Sakshi
Sakshi News home page

ఆరు నెలలు అక్కడ సూర్యుడే రాడు

Mar 21 2026 10:48 AM | Updated on Mar 21 2026 10:48 AM

place with six months darkness svalbard arctic polar night

రోజులో పగలు, రాత్రి  ఉంటాయి తెలుసు కదా. అయితే సంవత్సరంలో సగం కాలం చీకటి మాత్రమే ఉండే ఒక ప్రదేశం ఉందని తెలుసా? ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని ద్వీపసమూహమైన స్వాల్‌బార్డ్‌ ప్రాంతంలో ఈ వింత కనపడుతుంది. ఇక్కడ వరుసగా ఆరు నెలలపాటు సూర్యుడు రాడు. ఈ వింత చూడటానికి ఈప్రాంతాన్ని సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తుంటారు. 

దగ్గరి భూభాగమైన నార్వేకూ, ఉత్తర ధ్రువానికి దాదాపు మధ్యలో ఉంది స్వాల్‌బార్డ్‌ ద్వీపం. దాని హై ల్యాటిట్యూడ్‌  కారణంగా  పగటి వెలుగులో తీవ్రమైన వైవిధ్యాలు ఉంటాయి. అక్టోబర్‌ చివరి నుండి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు రాకపోవడంతో ఈ ద్వీపసమూహం చీకటిలో మునిగి΄ోతుంది. స్వాల్‌బార్డ్‌లో ఈ సీజన్‌లో నిత్యం సాయంత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఆకాశం ముదురు నీలం, ఊదా రంగుల మధ్య మారుతూ ఉంటుంది. మంచుతో నిండిన ప్రకృతి మీద  దివ్యమైన కాంతి పడుతుంటుంది.

ఇక్కడ పగటి వెలుగు లేనప్పటికీ స్వాల్‌బార్డ్‌లో ప్రజల జీవితం నిరాటంకంగా కొనసాగుతుంది. సాహసయాత్రలు చేసే ప్రయాణికులు ఈప్రాంతపు విశిష్టమైన అందాన్ని, వన్య్ర΄ాణులను చూడటానికి వస్తుంటారు. స్వచ్ఛమైన తెల్లని విశాల ప్రదేశాలలో చేసే స్నోమొబైల్‌ సఫారీలు, కఠినమైన భూభాగాలను అన్వేషించడానికి, మంచుతో నిండిన ఫ్యోర్డ్‌లు, గడ్డకట్టిన సముద్రాలలో సంచరించే ఆర్కిటిక్‌ నక్కలు, రెయిన్‌  డీర్‌లు, బహుశా అంత సులభంగా కనపడని ధ్రువపు ఎలుగుబంటిని కూడా చూసేందుకు ఒక అవకాశాన్ని అందిస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement