
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!.
కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్‌తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు.
ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్‌తో 4 బ్రెడ్, మిల్క్‌షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో చేసిన మిల్క్ షేక్.
లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్‌కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్‌లో వివరించాడు.
మెరుగైన ఫలితాల కోసం..
భోజనం పరిమాణం పెంచుకోవడం
హైడ్రేట్‌గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండి
ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర
వ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి.
(చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి)