ఈ టెక్నిక్‌ పాటిస్తే.. ఈజీగా డబ్బు సంపాదించగలరు! | Sakshi
Sakshi News home page

ఈ టెక్నిక్‌ పాటిస్తే.. ఈజీగా డబ్బు సంపాదించగలరు!

Published Fri, Sep 1 2023 2:30 PM

The Japanese Mantra To Make Money - Sakshi

పొద్దిన లేచిన దగ్గర నుంచి డబ్బు లేకుండా ఒక్క పని కూడా కాదు. దీంతో అందరూ డబ్బు సంపాదించే మార్గాలను తెగ అన్వేషిస్తుంటారు. ఎలా సంపాదించాలి. ఏవిధంగా ఈజీగా సంపాదించగలం అని రకరకాలు ఆలోచించేస్తుంటారు. ఆ క్రమంలో వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం, నిద్రలేమి తదితర సమస్యల బారిన పడతారు. పోనీ అంతలా ట్రై చేసినా.. సక్సెస్‌ అయ్యేవారు కొందరే. చాలామంది రీచ్‌ అవ్వరు. అలాంటివాళ్లు ఈ టెక్నీక్ ఫాలో అయితే ఎక్కువ డబ్బు సంపాదించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండగలరు. జపనీస్‌ వాళ్లు ఈ టెక్నిక్‌నే ఫాలో అవుతారట.

ఇంతకీ ఆ టెక్నిక్‌ ఏంటంటే.. "అరిగాటో".. అంటే.. జపనీస్‌ భాషలో "ధన్యవాదాలు" అని అర్థం. ఏంటిది? డబ్బు సంపాదించడానికి "ధన్యవాదాలకు" సంబంధం ఏంటీ అని కొట్టిపడేయొద్దు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్‌కి.. మనకు, మన కుటుంబ అవసరాలు.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుని పడరాని పాట్లు పడతాం. పోనీ అంతలా కష్టపడ్డా.. సంతోషంగా మాత్రం  ఉండం. నిరాశ నిస్ప్రుహలకు లోనే మళ్లీ జీరో పొజిషన్‌కి వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చేజేతులారా తెలియకుండానే నాశనం చేసుకుంటాం. అందువల్ల ముందు పాజిటివ్‌ దృక్పథాన్ని అనుసరిస్తూ దాన్నే మననం చేస్తే డబ్బులు హాయిగా సంపాదించడమే కాదు, కొత్త కొత్త ఐడియాలు తట్టి మరింత సంపాదించే అవకాశాలు రావచ్చు.

ఇంతకీ ధన్యవాదాలు అంటున్నారు.. ఎవ్వరికి చెప్పాలనే కదా!. మీకు మీరు థ్యాంక్స్‌ చెప్పుకోండి. ఎందుకు? అనే కదా..నిజానికి మనం సంపాదించే డబ్బు  రెండు రకాలుగా ఉంటుంది. (1) సంతోషాన్నిచ్చే డబ్బు, (2) ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు.

సంతోషాన్నిచ్చే డబ్బు అంటే..
మీరు ఆనందించే వస్తువులను కొనడానికి ఉపయోగించే డబ్బు లేదా మీరు ప్రేమించే వ్యక్తులకు వినియోగించే డబ్బు అ‍న్నమాట. ఇందులోకి మంచి పనులకు ఆనందంగా ఎంతకొంత కేటాయించేది కూడా వస్తుంది. ఇక్కడ మీరు సంతోషంగా వినియోగిస్తే అది విశ్వంలోకి చేరి మీకు తెలియకుండానే అధిక డబ్బు తిరిగి పొందే అవకాశం వస్తుంది. 

ఎలాంటి సంతోషం ఇవ్వని డబ్బు..
డబ్బుకి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం ఖర్చు చేసేది. నచ్చని ఉద్యోగం చేస్తూ.. సంపాదించేది. బిల్లులు లేదా అప్పులు చెల్లించడం కోసం భారంగా చేసేది. కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి తప్పక చేసేది. ఇది మీకు తెలియకుండానే డబ్బుపై వ్యతిరేకతను విశ్వంలోకి పంపుతుంది తద్వారా మనఃశాంతి కోల్పోతాం. అది మన ప్రేరణతోనే జరుగుతోందని గమనించం అంతే.

మనసతత్వ నిపుణులు కూడా చెప్పేది ఇదే. పాజిటివ్‌ మైండ్‌తో ఉంటే దేన్నైనా సునాయాసంగా సాధించగలరని పదే పదే చెబుతుంటారు. అందుకే ముందు మీరు సంపాదించేది ఎంతైనా సరే.. చాలా చిన్న మొత్తం డబ్బైనా వస్తున్నందుకు ధన్యావాదాలు చెప్పుకోండి అంటే ఇక్కడ అర్థం దేవుడిన నమ్మే వాళ్ల అయితే దేవుడికి లేదా ఇంతైనా సంపాదించగలుగుతున్నా అని మీకు మీరు కృతజ‍్క్షతలు చెప్పుకుని సంతృప్తిగా ఫీలవ్వండి. ఎంత వచ్చినా దాన్ని మీరు కరెక్ట్‌గా ఖర్చుపెట్టడాన్ని గ్రేట్‌గా భావించండి.

ఆ డబ్బును సరైన రీతిలో ఖర్చు బెట్టి బతకగలుగుతున్నందుకు హ్యపీగా ఫీలవ్వండి. ఆ డబ్బును వినియోగిస్తున్న సంతోషంగానే భావించండి తప్ప ఏదో సంపాదిస్తున్నానే లే అన్నట్లు మీకు మీరుగా మిమ్మిల్ని తక్కువ చేసుకోవద్దు. ఇలా పాజిటివిటిని మీ మనుసు తరంగాల ద్వారా విశ్వంలోకి పంపితే అదే మీకు తిరిగి అధిక డబ్బును ఏదో ఒక రూపంలోనో లేక మంచి ఆలోచనల రూపంలోనో అందిస్తుంది. మంచిగా డబ్బు సంపాదించడమే కాదు అధికంగా కూడా ఆర్జించగలుగుతారు కూడా.

అందుకనే పెద్దలు చెప్పేది మీ మీద మీరు నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమే గాని విఫలం కాదని. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి సర్వత్రా పాజిటివ్‌ మైండ్‌ని నింపి మంచి విజయాలు అందుకోండి. మంచైనా చెడైయినా అంతా మన మంచికే అని ఊరికే అనలేదు పెద్దలు. ఇలా భావిస్తే మనం ముందుగా పోగల ధైర్యం లభిస్తుంది. సో ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ఎంత వచ్చినా మ్యానేజ్‌ చేసి హాయిగా బతకగలుగుతున్నాం అన్నదే ముఖ్యం.

(చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్‌ పార్క్‌"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!)

Advertisement
Advertisement