"ట్రావెలింగ్‌ పార్క్‌" డ్రైవర్‌ క్రియేటివిటీకి..నెటిజన్లు ఫిదా! | Chennai Auto Driver Creates Mini Garden Inside His Auto; Video Viral - Sakshi
Sakshi News home page

గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్‌ పార్క్‌"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!

Published Fri, Sep 1 2023 12:47 PM

Chennai Driver Creates Mini Garden Inside His Auto - Sakshi

కొద్ది దూరంలోని గమ్యస్థానాలకు చేరడానికి వినియోగించే ఆటోల గురించి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో ప్రయాణీకులను అట్రాక్ట్‌ చేసేలా ఆటోలను డెకరేట్‌ చేస్తున్నారు కూడా. అయితే ఈ డ్రైవర్‌ మాత్రం మరింత విభిన్నంగా ఆలోచించి మరీ వైరైటీగా తీర్చిద్దిదాడు. అతడి ఆటోని చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

ఆ వీడియోలో..ఆ ఆటో మొత్తం గ్రీన్‌గా ఓ పార్క్‌ మాదిరి కనిపిస్తుంది. చూడగానే ఇది ఆటోనేనా అనిపిస్తుంది. ఆటోలో మొక్కలను ఏర్పాటు చేసిన సందర్భాలు చూశాం. ఇది మాత్రం అంతకు మించి అన్నట్లు ఉంది. ఏకంగా మొత్తం గ్రీనరీనే..ఏకంగా ఆటోలోని పైనంతా పూల మొక్కలు అలిమేసి ఉన్నాయి. ఇక సైడ్స్‌ పూలకుండీలు ఇవేగాక తాగునీరు, మోటివేషనల్‌ బుక్స్‌, మోటివేషనల్‌ ప్టోసర్లతో ఎంతో అట్రాక్టివ్‌గా మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆటోలో మిని గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు ఆ డ్రైవర్‌. అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తూ..అది జంగిల్‌ ఆటో అని ఒకరు, గ్రీన్‌ ఆటో మరొకరూ, కాదు కాదు ట్రావెలింగ్‌ పార్క్‌ అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!)

Advertisement
 
Advertisement