సీన్‌ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ | Japanese influencers Mayo and Kake Taku recreate K3G | Sakshi
Sakshi News home page

సీన్‌ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ

May 26 2024 6:20 AM | Updated on May 26 2024 6:20 AM

Japanese influencers Mayo and Kake Taku recreate K3G

భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్‌ చేయడం కొత్త కాదు. అయితే జపాన్‌లో మాత్రం బాలీవుడ్‌ హిట్‌ సినిమాల ఐకానిక్‌ సీన్‌లను రీక్రియేట్‌ చేసే కొత్త ట్రెండ్‌ మొదలైంది. బాలీవుడ్‌ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్‌గా షారుఖ్‌ ఖాన్‌ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు.

 ‘లెర్నింగ్‌ హిందీ ఇన్‌ 2024 ఈజ్‌ లైక్‌ బడే మజాకీ హో’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ  వీడియో వైరల్‌ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్‌ సింక్‌ బాగా కుదిరింది. ‘క్రాస్‌–కల్చరల్‌ అడ్మిరేషన్‌ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్‌ ఎన్నో యూజర్‌ల నుంచి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement