మేరీ జిందగీ..వేకప్‌ గరల్స్‌

India first Women Mission Rock Band to perform in Kashmir - Sakshi

అవేకెండ్‌ హిందుస్థాన్‌ ఈజ్‌ అవేక్, ఎవ్రీ హ్యూమన్‌ బీయింగ్‌ హాజ్‌ అవేకెండ్‌ ద ఎర్త్‌ యాజ్‌ అవేకెండ్‌ అండ్‌ ది స్కై ఈజ్‌ అవేక్‌... సో యూ ఆల్‌సో వేకప్‌!!
అంటూ ఈ ట్యూన్‌.. కశ్మీరి బాలికల్లో మానసిక ధైర్యాన్ని నూరిపోస్తోంది. కశ్మీకు ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదా ఎత్తి వేసిన తరువాత కూడా అక్కడి పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులను అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం, ఇండియన్‌ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే లక్నోకు చెందిన ‘మేరి జిందగీ’ బ్యాండ్‌ను కశ్మీకు పంపి అక్కడి బాలికల్లో అనేక అంశాలపై అవగాహన కలి్పస్తోంది. రేపటి (అక్టోబర్‌ 11) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్‌ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.
 
విన్నింగ్‌ హార్ట్స్‌ అండ్‌ మైండ్స్‌
ఆర్మీ సరిహద్దుల్లో ఉండి పోరాడుతూ దేశప్రజలు, కశీ్మరీల ప్రాణాలకు రక్షణ కల్పించడంతోపాటు, అక్కడి మహిళలు, బాలికల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే  ‘‘విన్నింగ్‌ హార్ట్స్‌ అండ్‌ మైండ్స్‌ (డబ్ల్యూహెచ్‌ఏఎమ్‌), సద్భావన’’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా..‘మేరీ జిందగీ’ బ్యాండ్‌ను కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో రెండు రోజులపాటు (9, 10) పర్యటిస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి.. విద్య, ఆత్మరక్షణ, ప్రాథమిక హక్కులు, సమానత్వం, మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ వంటి విషయాలపై అక్కడి మహిళలు, బాలికల్లో పాటల ద్వారా రాక్‌ బ్యాండ్‌ అవగాహన కలి్పస్తోంది. తమని తాము రక్షించుకోవడానికి ఉపయోగపడే ఆత్మరక్షణ మెళకువలను పాటల ద్వారా నేరి్పంచడం, మహిళలను చుట్టుముట్టే సమస్యలపై సంగీత కచేరీల ద్వారా విభిన్న కోణాల్లో వివరించడం, కొంతమంది విద్యారి్థనులతో ముచ్చటించి ఆరోగ్యం, విద్య, సమానత్వం వంటివాటి ప్రాముఖ్యతను తెలియజెబుతోంది.  
 
మేరీ జిందగీ..
దేశంలో తొలి మహిళా రాక్‌ బ్యాండ్‌ మేరి జిందగీ. దీనిని 2010లో డాక్టర్‌ జయ తివారీ స్థాపించారు. ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ లక్ష్యంగా ఏర్పడిన మహిళా బ్యాండ్‌ వివిధ అంశాల్లో మహిళలు, బాలికలకు అవగాహన కలి్పంచేందుకు ప్రత్యేకమైన పాటలు, సంగీతాన్ని రూపొందించి, పాటల రూపంలో ప్రదర్శిస్తుంది. ఇప్పటిదాక 350పైగా షోలను బ్యాండ్‌  నిర్వహించింది. బ్యాండ్‌ లీడర్‌ జయ స్వయంగా పాటలను రచించి, వాటికి ట్యూన్‌లు రూపొందించడం విశేషం. ఇంకా ఈ బ్యాండ్‌లో నిహారిక దుబే, పుర్వి మాలి్వయా, సౌభాగ్యా దీక్షిత్, మేఘన శ్రీవాస్తవ లు ఉన్నారు. ఈ బ్యాండ్‌ మహిళలకు మరింత దగ్గరయ్యేందుకు పింక్‌ డ్రెస్‌కోడ్‌ని ధరించడం విశేషం. ఈ ఐదుగురు కలిసి వివిధ రకాల సంగీత వాయిద్యాలతో మహిళలు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top