బిజీగా ఉండే వాళ్లకి ఈ డివైస్‌తో గార్డెనింగ్‌ ఈజీ! | Sakshi
Sakshi News home page

Hydroponics Gardening System: బిజీగా ఉండే వాళ్లకి ఈ డివైస్‌తో గార్డెనింగ్‌ ఈజీ!

Published Sun, Sep 3 2023 12:55 PM

Hydroponics Gardening System Makes It Easy To Grow Garden - Sakshi

గార్డెనింగ్‌ అంటే ఇష్టం ఉండి, వాటి సంరక్షణ చూసుకునే తీరికలేని వాళ్లకు ఈ డివైస్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్‌ గార్డెనింగ్‌ సిస్టమ్‌.. పాలకూర, టొమాటో, బచ్చలికూర, కొత్తిమీర, గులాబీ, చామంతి వంటి నచ్చిన మొక్కల్ని పెంచుకోవడానికి యూజ్‌ అవుతుంది. ఇందులో త్రీ లైట్స్‌ సెట్టింగ్‌ ఉంటుంది. రెడ్‌ కలర్‌ లైట్‌.. విత్తనాలు వేసినప్పుడు, బ్లూ లైట్‌ మొక్క ఎదుగుతున్నప్పుడు, సన్‌ లైక్‌ లైట్‌ పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్‌ చేసుకోవాలి.

నీళ్లు ఏ మోతాదులో ఉన్నాయి, ఎంతకాలం వరకు సరిపోతాయో కనిపిస్తుంటాయి. నీళ్లు పోయడానికి ప్రత్యేకమైన హోల్‌ ఉంటుంది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్‌  టాబ్లెట్స్‌ వేస్తూ ఉండాలి. ఈ గాడ్జెట్‌తో మొక్క 5 రెట్లు వేగంగా పెరుగుతుంది. ఇందులో సైలెంట్‌ పంప్‌తో కూడిన వాటర్‌ ట్యాంక్‌ ఉంటుంది. న్యూట్రియంట్‌ సొల్యూషన్స్‌, 24 సీడ్లింగ్‌ బ్లాక్స్, 12 ప్లాంటింగ్‌ బాస్కెట్స్‌ ఉంటాయి. డివైస్‌ లోపల నీటి పంపు ప్రతి గంటకు ముప్పై నిమిషాల పాటు ఆటోమెటిక్‌గా ఆన్‌  అవుతూ ఉంటుంది. ఈ డివైజ్‌ధర 69 డాలర్లు(రూ. 5661/-)

(చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్‌’ఫుల్‌గా కరువుకు చెక్‌!)

Advertisement
Advertisement