Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా... | Inspirational Story: How Mystery Guest Mona Patel Became One Of Met Gala 2024's Best Dressed Entrepreneur | Sakshi
Sakshi News home page

Mona Patel: సాధారణ స్థాయి నుంచి.. బిలియనీర్‌ వరకు!

May 9 2024 10:14 AM | Updated on May 9 2024 12:02 PM

Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా...

Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా...

ఆత్మవిశ్వాసమే రాజసం..!

వరల్డ్స్‌ మోస్ట్‌ ప్రిస్టీజియస్, గ్లామరస్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌ ‘మెట్‌ గాలా–2024’లో బ్రేక్‌ఔట్‌ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది మోనా పటేల్‌. ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా చేసింది. వడోదర నుంచి అమెరికా వరకు ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోనా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. ఫిలాంత్రపిస్ట్‌గా ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది...

గుజరాత్‌లోని వడోదరలో పుట్టి పెరిగిన మోనా పటేల్‌ చాలామంది అమ్మాయిలలాగే స్కూల్, కాలేజీ రోజుల్లో రకరకాల వివక్షలు, సవాళ్లు ఎదుర్కొంది. ‘ఆటలు మగవారి కోసమే’, ‘ఆడవారు ఇంట్లోనే క్షేమంగా ఉంటారు’ ‘లక్ష్యాలు అనేవి మగవారి కోసమే’ ఇలాంటి ఎన్నో పురుషాధిక్య భావజాల ధోరణులకు సంబంధించిన మాటలు విన్నది మోనా.

అయితే అలాంటి మాటలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. సవాలుకు సై అనడం తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు. పన్నెండు సంవత్సరాల వయసు నుంచి బాయ్స్‌–స్టైల్‌ హెయిర్‌ కట్‌తో కనిపించడంప్రారంభించింది. వస్త్రధారణ కూడా అచ్చం అబ్బాయిలలాగే ఉండేది.

‘ఏమిటీ వేషం’లాంటి వెక్కిరింపులకు ముఖం మీదే సమాధానం చెప్పి నోరు మూయించేది. ‘హెయిర్‌ కట్‌ అనేది రెబిలియన్‌ యాక్ట్‌. సెల్ఫ్‌–ఎంపవర్‌మెంట్‌కు సింబల్‌’ అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటుంది మోనా. ఇంటి నుంచి బయటి వెళ్లడమే సాహసంగా భావించే రోజుల నుంచి చదువు కోసం గుజరాత్‌ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. హోమ్‌టౌన్‌ తప్ప మరో టౌన్‌ తెలియని మోనా పైచదువుల కోసం  న్యూజెర్సీలోని రాత్‌గర్స్‌ యూనివర్శిటీకి వెళ్లింది.

‘ఔట్‌సైడ్‌ ఇండియా లైఫ్‌ గురించి ఎప్పటినుంచో ఆసక్తి ఉండేది. చదువుల రూపంలో అది నెరవేరింది. ఒంటరిగా బయలుదేరినప్పటికీ ఆ ఒంటరితనమే ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది’ అంటుంది మోనా. అమెరికాకు వెళ్లిన కొత్తలో అక్కడి వేషధారణ, ఆచార వ్యవహారాలు తనకు కొత్తగా అనిపించేవి.

‘ఈ ప్రపంచంలో నేను ఇమడగలనా!’ అని కూడా సందేహించేది. అయితే ఆ ప్రపంచంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయధ్వజం ఎగరేసింది మోనా పటేల్‌. ఒక్కో మెట్టు ఎక్కుతూ హెల్త్‌కేర్, టెక్, రియల్‌ ఎస్టేట్‌... మొదలైన రంగాలలో ఎనిమిది కంపెనీలను నెలకొల్పింది. వ్యాపార విజయాలే కాదు సామాజిక సేవాకార్యక్రమాలు కూడా మోనాకు ఇష్టం. జెండర్‌ ఈక్వాలిటీ, అమ్మాయిల చదువు, ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని ‘కొచర్‌ ఫర్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థనుప్రారంభించింది.

‘మూడు పెద్ద సూట్‌కేస్‌లతో తొలిసారిగా ఇండియా నుంచి డల్లాస్‌కు బయలుదేరాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మోనా.
ఆ సూటుకేసులలో విలువైన వస్తువులు ఉండచ్చు. అయితే వాటి అన్నిటికంటే అత్యంత విలువైనది... ఆమెలోని ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే మోనా పటేల్‌ను తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చేలా చేస్తోంది.

బంగారు రెక్కల సీతాకోకచిలక..
ప్రతిష్ఠాత్మకమైన మెట్‌గాలా 2024 ఎడిషన్‌ను న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, సారా జెస్సికా, ఆలియా భట్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా... మొదలైన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. మెట్‌ గాలా రెడ్‌ కార్పెట్‌పై కనిపించాలనేది ఎంతోమంది అమ్మాయిల కల.

అయితే తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులు ‘వావ్‌’ అనుకునేలా చేసి, మెట్‌ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పటేల్‌. ‘ది గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌’ థీమ్‌తో రూపొందించిన సీతాకోకచిలక ఆకారంలో ఉన్న గౌనుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ‘నా వారసత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకునేలా నా డెబ్యూ లుక్‌ ఉండాలనుకున్నాను’ అంటుంది పటేల్‌. రెడ్‌ కార్పెట్‌పై పటేల్‌ బ్యూటీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ సెన్సేషన్‌గా మారింది.

ఇవి చదవండి: Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement