పింగాణి పాత్రల్ని ఇలా క్లీన్‌ చేస్తే..! | How to Clean and Maintain Ceramic Utensils Properly | Sakshi
Sakshi News home page

పింగాణి పాత్రల్ని ఇలా క్లీన్‌ చేస్తే..!

Oct 3 2026 7:29 PM | Updated on Oct 3 2026 7:50 PM

 How to Clean and Maintain Ceramic Utensils Properly

ప్రస్తుత కాలంలో యూట్యూబ్‌లో... ఫేస్‌ బుక్‌లో చూసి వంట చేసేందుకు ఎక్కువగా సెరామిక్స్‌ అంటే పింగాణీ లేదా మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం. 

వంట చేసినప్పుడు కలపడానికి చెక్క, సిలికాన్‌ గరిటెలు వాడడం మంచిది. దీంతో  పాత్రలపై గీతలు పడకుండా ఉంటాయి. ఇందులో వేసిన ఆహారం కూడా వెంటనే కలపకూడదు. కాసేపు వేగిన తర్వాత కలపడం వల్ల ఫుడ్‌  పాన్‌కి అంటుకోకుండా ఉంటుంది. 
మాడి పోకుండా చూసుకోవాలి
ఇందులో వంటలు వండినప్పుడు మాడిపోకుండా చూడండి. మాడితే వాటి కోటింగ్‌ పోతుంది. అందుకే, మాడి పోకుండా చూసుకోవడం అవసరం. ఒకవేళ మాడితే పాత్ర చల్లారిన తర్వాత కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి తర్వాత స్పాంజి, గోరువెచ్చని నీటి మిశ్రమంతో క్లీన్‌ చేస్తే చాలు.

ఇదీ చదవండి: జేబులో రూ.100 అకౌంట్‌లో రూ. లక్ష : స్టాండప్‌ కమెడియన్ సక్సెస్‌ స్టోరీ
 

క్లీనింగ్‌ ఇలా...
వంట చేసిన వెంటనే వాటిని చల్లని నీటిలో వేసి క్లీన్‌ చేస్తుంటారు కొంతమంది. అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఇలా వేడి నుంచి ఒక్కసారిగా చల్లని నీరు తగిలేసరికి వాటిపై ఉండే కోటింగ్‌ పోతుంది. కాబట్టి, అది వాటిని రూమ్‌ టెంపరేచర్‌కి వచ్చాక వాటిని క్లీన్‌ చేయాలి. అలా అని గట్టిగా రుద్దుతూ తోమకూడదు. మైల్డ్‌ లిక్విడ్‌తో తోమిన తర్వాత సాఫ్ట్‌ బ్రష్‌తో రుద్దాలి. 

ఇదీ చదవండి: వచ్చిందండి వయ్యారి : రైలుకు కొంగుముడేసి రొమాంటిక్‌ రీల్‌!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement