టెక్‌ బిలియనీర్‌ లవ్‌ స్టోరీ : స్టార్‌ హీరోయిన్‌తో లవ్‌? కానీ పెళ్లి మాత్రం! | Hot mail co-founder Sabeer Bhatia And Tanya Sharma Love Story | Sakshi
Sakshi News home page

టెక్‌ బిలియనీర్‌ లవ్‌ స్టోరీ : స్టార్‌ హీరోయిన్‌తో లవ్‌? కానీ పెళ్లి మాత్రం!

Published Tue, Feb 11 2025 12:11 PM | Last Updated on Tue, Feb 11 2025 6:00 PM

Hot mail co-founder Sabeer Bhatia And Tanya Sharma Love Story

ఇటీవల ఆధార్‌ ఖర్చుపై  టెక్‌ బిలియనీర్‌ సబీర్‌ భాటియా  సంచలన వ్యాఖ్యలు

తాన్యాతో  లవ్‌, పెళ్లిపై కూడా వ్యాఖ్యలు, దీంతో  వైరల్‌గా వీరి లవ్‌స్టోరీ

మలేషియాలోని లంకావి దీవిలో వైభవంగా పెళ్లి చేసుకున్న సబీర్‌, తాన్యా, కొన్నేళ్లకే విభేదాలు

మైక్రోసాఫ్ట్‌ బిల్‌ గేట్స్‌తో డీల్‌ బంపర్ ‌హిట్‌, పెళ్లి మాత్రం  ఫట్‌!

ఆధార్‌ ఖర్చుపై సంచలన వ్యాఖ్యల్ని చేసిన హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ఆధార్ కోసం చేసిన (1.3 బిలియన్ల ఖర్చును వృథా అని చెప్పడంతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా  పంచుకున్నాడు. ముఖ్యంగా అతని లవ్‌ స్టోరీ, పెళ్లి విడాకులు  లాంటి అంశాలు నెట్టింట  సందడిగా మారాయి. 

బాలీవుడ్ ప్రముఖులతో  పరిచయాలు,  చాలామంది స్టార్లతో  డేటింగ్ చేయడం మొదలు, చాలా మంది మహిళలు తన పట్ల ఆకర్షితులయ్యేవారని, పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారని సబీర్ భాటియా చెప్పుకొచ్చాడు.  అయితే వీటన్నంటికీ భిన్నంగా తన కుటుంబ స్నేహితురాలు,  బైద్యనాథ్ గ్రూప్‌కు చెందిన తాన్యా శర్మతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు.   (బెస్ట్‌ ఫ్రెండ్‌ సంగీత్‌ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు)

సబీర్ భాటియా  చెప్పిన వివరాల ప్రకారం  తాన్య శర్మ కుటుంబంతో తమ కుటుంబానికి  ఎనిమిదేళ్లుగా పరిచయం. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు తమ స్నేహాన్ని కుటుంబ సంబంధంగా మార్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే నిజానికి సబీర్‌  తాన్యను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమెను కోడలిగా తెచ్చుకోవాలనే కోరిక మాత్రం తల్లిదే.  తల్లి  కోరిక మేరకు ఆమెతో మాట్లాడిన తరువాత, ఆమె ప్రేమలో పడటం,  జీవితాంతం ఆమెతో గడపాలని భావించాడు.

దీంతో వీరి  పెళ్లి  ఇరు కుటుంబాలు అంగీకరించాయి. సబీర్ భాటియా,  తాన్య శర్మ  జంట 2007, డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.ఆ తర్వాత మలేషియాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2008, మార్చి 9న, మలేషియాలోని ప్రసిద్ధ లంకావి ద్వీపంలో  గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. దాదాపు 270 మంది ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం సబీర్ మొత్తం లంకావి ద్వీపాన్నే బుక్‌ చేసుకున్నాడట.

పెళ్లైన కొన్నాళ్లకు వీరికి ఒక పాప పుట్టింది. ఈ పాపకు 'అరియాన్నా' అనే పేరు పెట్టారు. తాన్యా గుడ్‌కేర్ ఫార్మాకు డైరెక్టర్ (బైద్యనాథ్ గ్రూప్  సోదరి సంస్థ  గుడ్‌కేర్ ఫార్మా)గా ఉన్నారు.   తాన్యా  ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్  అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి కోర్సును కూడా  చదివింది.

అయితే పెళ్లైన ఐదేళ్లకు వీరి మధ్య విబేధాలు తారా​స్థాయికి చేరాయి.  2013లో  విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.  శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కోర్టులో విడాకులు తీసుకున్నారు.  విడాకుల తర్వాత అరియాన్నా చిన్నది కనుక ఆమె కస్టడీ హక్కులు తల్లి తాన్యా శర్మకు  అప్పగించారు. 

ఐశ్వర్యారాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!
అందాల ఐశ్వర్యం  ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట సబీర్‌. ఈ విషయంలో  నటుడు సల్మాన్ ఖాన్‌తో పెద్ద పోటీయే ఉండేదట. 2001లో ఒక పార్టీలో వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ పుకార్లను మీడియా ఊహాగానాలుగా భాటియా తోసిపుచ్చాడు.

కాగా సబీర్ భాటియా 1996లో హాట్‌మెయిల్‌ను సృష్టించడం ద్వారా ఇమెయిల్ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన వ్యాపార భాగస్వామి జాక్ స్మిత్‌తో కలిసి, భాటియా తొలి వెబ్ ఆధారిత ఇమెయిల్ సేవలలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్థాపించిన 18 నెలలకే దీన్ని అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్‌కు విక్రయించాడు. దీంతో రాత్రికి రాత్రే  వేలకోట్లకు అధిపతియ్యాడు.  ఈసొమ్ముతో మరిన్ని కంపెనీలను నిర్మించాడు. ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద, గేమ్-ఛేంజింగ్ ఒప్పందాలలో ఒకటిగా టెక్‌ వర్గాలు భావించాయి. ఈ డీల్‌ ద్వారా సబీర్ రూ. 3300 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. దీన్నే ఇపుడు  ఔట్‌లుక్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సబీర్‌ భాటియా AI-ఆధారిత అభ్యాస వేదిక, షోరీల్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement