పచ్చి బొప్పాయికి గాట్లు పెట్టగా వచ్చిన పాలతో ఇది కలిపి తాగితే.. పురుగులు పడి పోతాయి! ఆ తర్వాత..

Health Tips: Remedies For Intestinal Stomach Worms In Children - Sakshi

పిల్లలు కొన్నిసార్లు ఎంత రుచిగా చేసి పెట్టినా సరే, ఆకలి కావడం లేదంటారు. తరచూ విరేచనాలు చేసుకుంటారు. బరువు తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా అవుతోందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు.

నిజానికి ఇవి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలేమీ కాదు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం...

తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంది.

కడుపులో నులి పురుగులు పోవడానికి...
►వేప నూనె పది చుక్కలు చక్కెరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి.
►గుప్పెడు లేత వేప చిగురు, అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు కలిపి మాత్రల్లా చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.
పచ్చి బొప్పాయి కాయకు గాట్లు పెట్టగా వచ్చిన పాలు చెంచా, ఆముదం చెంచా కలిపి తాగితే.. పురుగులు పడి పోతాయి.

►ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు. మిరియాల పొడి చెంచా, ఉప్పు చెంచా కలిపి ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దగా కలుపుకుని తినాలి, లేదా గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి.
►వీటన్నింటినీ చేయడం కష్టం అనుకుంటే ఆల్బెండిజాల్‌ ట్యాబ్లెట్‌ను పదిహేను రోజులకొకసారి చొప్పున నెలరోజులు వాడాలి. ఒక నెల గ్యాప్‌ ఇచ్చి అదే రిపీట్‌ చేయాలి.  
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. 

చదవండి: మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను...
పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి?      

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top