హెల్త్‌ టిప్స్‌ | Health Tips | Sakshi
Sakshi News home page

హెల్త్‌ టిప్స్‌

Feb 25 2023 4:02 AM | Updated on Feb 25 2023 4:02 AM

Health Tips  - Sakshi

♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. 
♦  చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. 
♦  గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. 
♦  దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్‌ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్‌ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, 
♦  అజీర్ణం, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement