ఇంగ్లీష్‌ ఇడియమ్స్‌: హేమ్లెట్‌ విత్‌ఔట్‌ ది ప్రిన్స్‌

Hamlet Without The Prince Meaning in Telugu - Sakshi

జాతీయాలు అంటే వాక్యాలు, మాటలు కాదు. జీవితసత్యాలు. మాట్లాడే భాషకు ఇడియమ్స్‌ కూడా తోడైతే ఎంతో బాగుంటుంది. ఈవారం మచ్చుకు ఒకటి...
ఒక కార్యక్రమం లేదా ప్రదర్శనలో ప్రధానమైన వ్యక్తి రాకపోతే, కనిపించకపోతే ‘హేమ్లెట్‌ విత్‌ఔట్‌ ది ప్రిన్స్‌’ అంటారు. దీని ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటో తెలుసుకుందాం...

అది 1775 సంవత్సరం. లండన్‌ కేంద్రంగా వచ్చే ‘ది మార్నింగ్‌ పోస్ట్‌’ దినపత్రికలో ఒక వార్త ప్రచురితమయ్యింది. ‘హేమ్లెట్‌ విత్‌ఔట్‌ ది ప్రిన్స్‌’ ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. చదివితే అసలు విషయం బోధపడింది. ఇంతకీ మ్యాటర్‌ ఏమిటంటే... లండన్‌లో ఒక థియేటర్‌లో షేక్స్పియర్‌  ‘హేమ్లెట్‌’ నాటకం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఒక ఎనౌన్స్‌మెంట్‌ వినిపించింది.. (క్లిక్‌: అక్కడి పరిస్థితి హెలైసియస్‌గా ఉంది..!)

‘ప్రేక్షకమహాశయులకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు కూడా నాటకం ప్రదర్శించబడుతుంది. అయితే ఈ ఒక్కరాత్రి మాత్రం నాటకంలో హేమ్లెట్‌ పాత్ర ఉండదు’ ‘హేమ్లెట్‌ లేని నాటకం ఏమిటి!’ అని ప్రేక్షకులు తిట్టుకున్నారా, అడ్జస్టైపోయారా అనేది వేరే విషయంగానీ ఒక కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తి రాకపోతే ఈ ఇడియమ్‌ను ఉపయోగించడం పరిపాటి అయింది. (క్లిక్‌: డూ యూ వన్నా హ్యాంగవుట్‌?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top