కాంతార చాప్టర్ 1 మరో ఘనత.. తొలి ఇండియన్‌ చిత్రంగా! | Kantara Chapter1 will be released In this Language also | Sakshi
Sakshi News home page

Kantara Chapter1: కాంతార చాప్టర్ 1 మరో ఘనత.. తొలి ఇండియన్‌ చిత్రంగా!

Oct 22 2025 4:24 PM | Updated on Oct 22 2025 4:53 PM

Kantara Chapter1 will be released In this Language also

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లు రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కూడా కలిసి రావడంతో మరిన్ని రికార్డ్స్‌ క్రియేట్ చేయనుంది.

ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్‌ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్‌ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్‌ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్‌ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్‌లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది.

కాగా.. కాంతార చాప్టర్-1 ఇ‍ప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా ఘనత దక్కించుకుంది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement