మామూలు రోబో కాదు.. పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది | Flying Autonomous Robot Can Spot And Pick Ripe fruits | Sakshi
Sakshi News home page

మామూలు రోబో కాదు.. పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది

Mar 6 2022 12:55 PM | Updated on Mar 6 2022 12:55 PM

Flying Autonomous Robot Can Spot And Pick Ripe fruits - Sakshi

చిటారు కొమ్మన ఉన్న పండును కోసుకు రావాలంటే, ఇకపై చెట్టెక్కాల్సిన పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం దగ్గర ఉంటే, ఎంత ఎత్తయిన చెట్టు నుంచైనా ఇట్టే పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది. పెద్ద పెద్ద తోటల్లో వినియోగించుకోవడానికి అనువుగా రూపొందించిన ఈ పరికరం పేరు ‘టెవెల్‌ ఎఫ్‌ఏఆర్‌ ద్రోన్‌’. ఇది ద్రోన్‌ మాత్రమే కాదు, రోబో కూడా. ఫ్లయింగ్‌ ఆటానమస్‌ రోబో (ఎఫ్‌ఏఆర్‌).

అమెరికాకు చెందిన ‘టెవెల్‌ టెక్‌’ స్టార్టప్‌ కంపెనీకి చెందిన డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. త్వరలోనే దీని పనితీరును అమెరికా, స్పెయిన్‌ దేశాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని తోటల్లో పరిశీలించనున్నారు. పండ్లు కోసే ఈ రోబో ద్రోన్‌లను పెద్దసంఖ్యలో తయారు చేసేందుకు ‘టెవెల్‌ టెక్‌’ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement